ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఫలితం తేలదు.. రీజన్ ఇదే!
ఏపీలో తాజాగా జరిగిన ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి.. రాష్ట్ర హైకోర్టు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ఫలితాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. దీంతో ఇక్కడ ఎన్నికల ఓట్లు లెక్కించినా.. ఫలితం మాత్రం తేలదు. నిజానికి రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ స్థానానికి చాలా ప్రత్యేకత ఉంది. టీడీపీ, వైసీపీ, బీజేపీలు.. ఈ స్థానంపై చాలానే ఆశలు పెట్టుకున్నాయి. అయితే.. అనూహ్యంగా ఈ స్థానం ఫలితం మాత్రం సంకటంలో పడిపోయింది.
ఎందుకు?
పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక పోలింగ్ రోజున హైకోర్టుకు సెలవులు ఇచ్చారు. అయితే.. పోలింగ్ జరిగిన ఉత్తరాంధ్రాలోని మూడు జిల్లాల్లోని కోర్టులకు సెలవులు ఇవ్వలేదు. ఇదే ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ.. న్యాయవాది శ్రీనివాసరావు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం ఓట్లు లెక్కించినా ఎన్నికల ఫలితాలు తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది.
ఏం జరిగింది?
ఈ నెల 13న 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరిగింది. వీటిలో శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం(ఉత్తరాంధ్ర) కూడా ఉంది. ఈ నియోజకవర్గ ఎన్నిక పోలింగ్ రోజున హైకోర్టుకు సెలవులు ఇచ్చి.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని కోర్టులకు సెలవులు ఇవ్వలేదు. దీంతో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసిన న్యాయవాది శ్రీనివాసరావు తను నష్టపోతున్నానని పేర్కొంటూ హైకోర్టుకు వెళ్లారు.
"ఎన్నికలు జరగని చోట హైకోర్టుకు సెలవులు ఇచ్చి.. ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లోని కోర్టులకు సెలవులు ఇవ్వలేదు. దీనివల్ల పోటీ చేసిన న్యాయవాది శ్రీనివాస్ కు న్యాయవాదులు, కక్షిదారులు, ఉద్యోగులు ఓటు వేయలేకపోయారు.
రాజ్యాంగపరమైన ఓటు హక్కును వినియోగించుకునే అవకాశాన్ని కోల్పోయారు" అంటూ పిటిషనర్ తరుపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఓట్ల లెక్కింపు జరిగినప్పటికీ ఫలితం తుది తీర్పునకు లోబడి ఉంటుందని తెలియజేస్తూ.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. సో.. ఇదీ.. సంగతి. దీంతో అన్ని పార్టీల్లోనూ టెన్షన్ నెలకొంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.