ఉత్తరాఖండ్​ సీఎంకు పాజిటివ్! కరోనా తిరగదోడుతోందా?

Update: 2020-12-18 12:00 GMT
దేశవ్యాప్తంగా కరోనా తగ్గుముఖం పడుతోంది.. వ్యాక్సిన్​ వచ్చేస్తోంది అన్న వార్తలతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. ఇప్పుడిప్పుడే కాస్త కుదుట పడుతున్నారు అనుకుంటుండగా.. ఇదే సమయంలో అక్కడక్కడా మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. పోయిందనుకున్న కరోనా మళ్లీ తిరగదొడుతుందా ఏమిటని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

కరోనా కట్టడికి వ్యాక్సిన్​పై తుది దశ ప్రయోగాలు సాగుతున్న ప్రస్తుత తరుణంలో మళ్లీ మహమ్మారి వ్యాప్తి ఆందోళనకు గురిచేస్తున్నది. తాజాగా ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్‌ రావత్ కు కరోనా సోకింది. దీంతో ఆయన హోమ్​ ఐసోలేషన్​లో ఉంటున్నారు. త్రివేంద్రసింగ్​కు లక్షణాలు చాలా తక్కువగానే ఉన్నాయి. అయినప్పటికీ ఆయన డౌట్ వచ్చి పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్​ అని తేలింది. ‘ నాకు కరోనా సోకింది. నేను ప్రస్తుతం హోమ్​ ఐసోలేషన్​లో ఉన్నా. ఇటీవల నన్ను కలిసినవాళ్లు వెంటనే పరీక్షలు చేయించుకోండి’ అంటూ ఆయన ట్వీట్​ పెట్టాడు.

ఆయన ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో హోమ్​ ఐసోలేషన్​లో ఉన్నారు. కొంతకాలం పాటు ఆయన ఇంటి నుంచే అధికారిక కార్యకలాపాలు నిర్వర్తించనున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కొద్దిమేర తగ్గినప్పటికీ కనిపిస్తున్నది. అయినప్పటికీ అక్కడక్కడా కేసులు నమోదవుతూనే ఉన్నాయి. కరోనా తగ్గినా కాస్త అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేస్తున్నాయి.
Tags:    

Similar News