స‌ల‌హా ఎందుకు నువ్వే రావొచ్చుగా వీహెచ్‌

Update: 2015-08-22 06:04 GMT
వినేవాడు ఉండాలే కానీ చెప్పేటోడు చెల‌రేగిపోతార‌న‌టానికి తెలంగాణ కాంగ్రెస్ నేత వీహెచ్ ఓ పెద్ద ఉదాహ‌ర‌ణ‌. గ‌తంలో తెలంగాణ గురించి ఎవ‌రైనామాట్లాడితే.. అదేంది భ‌య్‌.. ఆంధ్రోళ్లు ఎట్ల మాట్ల‌డ‌త‌రు అనోటోళ్లు. విభ‌జ‌న జ‌రిగిపోయిన త‌ర్వాత‌.. తెలంగాణ వాళ్లు తెలంగాణ రాజ‌కీయాలు మాత్ర‌మే మాట్లాడ‌టం.. ఆంధ్రోళ్లు.. ఆంధ్రా రాజ‌కీయాలే ప్ర‌స్తావించ‌టం మామూలైంది.

ఏదో వీహెచ్ లాంటి ఒక‌టి అరా నేత‌లు మాత్రం అన్నీ విష‌యాల్లో త‌ల దూరుస్తుంటారు. తాజాగా ఏపీ స‌ర్కారుపై.. జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌క‌ల్యాణ్ ట్వీట్ ల‌తో స‌ల‌హాలు.. సూచ‌న‌లు.. కొద్దిపాటి హెచ్చ‌రిక‌లు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఏపీ రాజ‌ధాని కోసం భూసేక‌ర‌ణ చేప‌ట్టాల‌ని.. చ‌ట్టాన్ని ప్ర‌యోగించి.. త‌మ మాట విన‌ని రైతుల‌ తాట తీయాలని చ‌ట్ట‌మ‌నే క‌త్తిని నూరి.. శుక్ర‌వారం ఉద‌యం ఆర్డ‌ర్ జారీ చేసేశారు.

భూసేక‌ర‌ణ చ‌ట్టాన్ని అమ‌లు చేయొద్ద‌ని.. ఇష్టం లేని రైతుల ద‌గ్గ‌ర నుంచి బ‌ల‌వంతంగా భూములు తీసుకోవ‌ద్ద‌ని చెప్పిన ప‌వ‌న్‌.. గురువారం ట్విట్ట‌ర్‌లో తాను త్వ‌ర‌లో రాజ‌ధాని ప‌రిధిలోని కొన్ని ఊళ్ల‌ల్లో ప‌ర్య‌టించ‌నున్న‌ట్లు చెప్ప‌టం తెలిసిందే. త‌మ పంట పొలాలు ఇవ్వ‌కుండా.. భూసేక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఉండే ఊళ్ల‌ను ప‌ర్య‌టిస్తాన‌ని చెప్పారు.

అయితే.. ఇలాంటివేమీ క‌నిపించ‌ని.. వినిపించ‌ని వీహెచ్ తాజాగా ప‌వ‌న్‌ పై స‌టైర్ వేసేశారు. ఇంట్లో కూర్చొని ట్విట్ట‌ర్‌ లో ట్వీట్లు చేయ‌టం కాదు.. రైతుల ఊళ్ల‌కు వ‌చ్చి భూసేక‌ర‌ణ మీద పోరాడాల‌ని సూచించారు. ఇన్ని మాట‌లు చెబుతున్న వీహెచ్‌.. ప‌వ‌న్‌ కు స‌ల‌హాలు ఇవ్వ‌టం మానేసి.. ఏపీ రాజ‌ధాని రైతుల వ‌ద్ద‌కు వెళ‌తామంటే కాదంటారా? ఒక్క‌డే వెళ్ల‌టం క‌ష్టం అనుకుంటే.. త‌మ పార్టీకే చెందిన చిరంజీవి లాంటి గ్లామ‌ర్ ఉన్న నేత‌ను వెంట తీసుకెళితే మైలేజీకి మైలేజీతో పాటు.. అధినేత్రి ద‌గ్గ‌ర మంచి మార్కులు కూడా కొట్టేయొచ్చుగా. వ్యంగ్యంగా ప‌వ‌న్ మీద వ్యాఖ్య‌లు చేసే బ‌దులు.. ప‌నికి వ‌చ్చే ప‌నులు చేస్తే.. రాజ్య‌స‌భ ట‌ర్మ్ అయిపోయే నాటికి అడ్జెస్ట్ చేసి మ‌రీ సోనియ‌మ్మ రెన్యువ‌ల్ చేస్తారేమో. ఈ కోణంలో వీహెచ్ ఆలోచిస్తే బాగుంటుందేమో..!
Tags:    

Similar News