మిగిలిన విషయాలు ఎలా ఉన్నా.. తనపై ఘాటు వ్యాఖ్యలు చేసిన వారిని.. తన పట్ల దూకుడుగా వ్యవహరించే వారిని గవర్నర్ గుర్తుంచుకోవటం తెలిసిందే. తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మేనల్లుడు హరీశ్ రావు దూకుడుగా వ్యవహరించటం.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఆ విషయాన్ని ఆయన గుర్తుంచుకొని ప్రస్తావించటం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గవర్నర్ ను కలిసిన కేసీఆర్‌తో.. హరీశ్ రాలేదా? అని ఆరా తీశారు. ఒక్క హరీశ్ ను మాత్రమే కాదు.. తెలంగాణ ఏర్పడిన తర్వాత తన పట్ల దూకుడుగా వ్యవహరించిన టీటీడీపీ సీనియర్ నేత రేవంత్ రెడ్డిని కూడా గవర్నర్ ఇదే తీరులో గుర్తుంచుకున్నారు.
రానున్న రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావును కూడా గవర్నర్ నరసింహన్ గుర్తుంచుకోవటం గ్యారెంటీ. హరీశ్..రేవంత్ లకు మించి గవర్నర్ వ్యక్తిగత అంశాల్ని ఎత్తి చూపుతూ వీహెచ్ ఒక రేంజ్లో విరుచుకుపడటమే దీనికి నిదర్శనం. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నర్ గా తెలుగు నేల మీద అడుగు పెట్టినా.. విభజన లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ.. మోడీ సర్కారు కొలువుదీరిన తర్వాత తన పదవిని కాపాడుకుంటూ.. ఏళ్లకు ఏళ్లు బండి లాగేస్తున్న నరసింహన్ పై పెద్దగా విమర్శలు లేవనే చెప్పాలి.
కానీ.. ఆయనలోని అధ్యాత్మిక తత్వం.. దైవభక్తి కారణంగా పలుమార్లు విమర్శలు చెలరేగాయి. రాజ్ భవన్ కు కూతవేటు దూరంలో ఉండే హనుమాన్ టెంపుల్ గా వారంలో అన్ని రోజులు దాదాపు పొద్దున్నే వెళ్లి దర్శనం చేసుకురావటం గవర్నర్ కు అలవాటు. ఆయన కారణంగా ట్రాఫిక్ జాం అవుతుందని ఒక ఇంగ్లిషు పత్రిక ప్రముఖంగా ప్రచురిస్తూ.. విమర్శిస్తే ఆయన తెగ ఫీలైపోయారు. ఆ మధ్య తిరుమలకు అదే పనిగా వెళ్లి.. సాధారణ భక్తులకు ఇబ్బందిగా మారారన్న విమర్శల్ని ఆయన మూట గట్టుకున్నారు. ఈ మధ్యన తిరుమలకు వెళ్లటం ఆయన తగ్గించినా.. ఆయన కానీ శ్రీవారి దర్శనానికి వెళితే కనీసం గంట పాటైనా సామాన్య భక్తుల దర్శనం ఆగిపోతుందని చెబుతుంటారు.
ఈ విషయాలన్నీ పట్టుకొన్న వీహెచ్.. తాజాగా గవర్నర్ నరసింహన్ ను విమర్శలతో ఉతికి పారేశారు. నరసింహన్ గవర్నర్ గా తెలుగు రాష్ట్రానికి వచ్చిన నాటి నుంచి పంతుళ్ల హవా పెరిగిపోయిందన్న వివాదాస్పద వ్యాఖ్య కూడా చేశారు. ఉగాది సందర్భంగా నిర్వహించే పంచాంగ శ్రవణం ఒక రోజు ముందుగా చేయటాన్ని తీవ్రంగా తప్పు పట్టిన వీహెచ్.. గవర్నర్ భక్తి కారణంగా సామాన్యులు తీవ్ర కష్టాలకు గురి అవుతున్నారన్నారు.
తిరుమలకు తమలాంటి వాళ్లు వెళితే వీఐపీ దర్శనానికి అనుమతించరని.. గవర్నర్ మాత్రం రెండేసి గంటలు ఆలయంలో గడుపుతారని.. అప్పుడు భక్తులు ఇబ్బంది పడరా? అంటూ ప్రశ్నించారు. గవర్నర్ తన హోదాను మరిచి ఆలయాల చుట్టూ తిరుగుతున్నారన్న వీహెచ్.. గవర్నర్ కారణంగా పంతుళ్ల అధిపత్యం కూడా పెరిగిపోయిందంటూ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ మీద ఒక రాజకీయ నాయకుడు ఇంత సునిశితంగా ఫైర్ అయ్యింది లేదు. మరి.. వీహెచ్ విమర్శలకు గవర్నర్ ఎలా రియాక్ట్ అవుతారో..?