గత కొద్దిరోజులుగా ఆరోగ్య పరిస్థితి సరిగా లేక వైద్యం చేయించుకున్న తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత.. రాజ్యసభ సభ్యులు వీహెచ్ హనుమంతరావు తాజాగా మీడియాతో మాట్లాడారు. గత కొద్దిరోజులుగా వార్తల్లో లేని లోటును తీరుస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఉగాది సందర్భంగా పార్టీలు ఎవరికి వారుగా నిర్వహించుకునే పంచాంగ శ్రవణంపై విమర్శల్ని ఎక్కుపెట్టారు.
ఉగాది పంచాంగ శ్రవణం సందర్భంగా ఏ పార్టీకి ఆ పార్టీ ఏర్పాటు చేసుకున్న పండితులు పొగిడేయటం బాగోలేదని.. ఇదే తీరులో సాగితే.. పంచాంగ శ్రవణం మీద నమ్మకం పోతుందని ఆయన విమర్శించారు.గడిచిన కొన్నేళ్లుగా పంచాంగ శ్రవణం సందర్భంగా పండితులు చేస్తున్న వ్యాఖ్యలపై అసంతృప్తి వ్యక్తమవుతున్నా.. ఎవరూ నోరు విప్పింది లేదు. అందుకు భిన్నంగా వీహెచ్ మాత్రం ధైర్యం చేసి పెదవి విప్పటమే కాదు.. ఉత్తిపుణ్యానికే పొగడ్తలు సరికావన్న విషయాన్ని స్పష్టం చేయటమే కాదు.. పండితులు ఎవరికి వారు వారిని పిలిచిన వారికి తగినట్లుగా చేస్తున్న వ్యాఖ్యల్ని తప్పు పట్టిన వీహెచ్ తీరు అభినందనీయమని చెప్పాలి. నిజం నిష్ఠూరంగా ఉన్నా ఫర్లేదు కానీ.. శాస్త్రాన్ని తప్పుదారి పట్టించే తరహాలో వ్యవహరించటం మంచిది కాదన్న విషయాన్ని వీహెచ్ తన తాజా వ్యాఖ్యలతో చెప్పకనే చెప్పేశారని చెప్పాలి. నిజానికి ఈ తరహా నిజాల్ని మాట్లాడటానికి నేతలు పెద్దగా ఇష్టపడరు. కానీ.. వీహెచ్ తన వ్యాఖ్యలతో ఆ లోటును తీర్చారని చెప్పాలి.