సోషల్ మీడియాలో ప్రచారంపై వీహెచ్ ఫిర్యాదు

Update: 2022-02-21 12:30 GMT
సోషల్ మీడియాలో తనపై జరుగుతున్న దుష్ప్రాచారంపై మాజీ ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు (వీహెచ్) సైబర్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదుచేశారు. ఎవరో ఉద్దేశ్యపూర్వకంగానే తనపై దుష్ప్రాచారానికి దిగినట్లు అనుమానించారు.

తాను సుదీర్ఘకాలంగా కాంగ్రెస్ పార్టీలోనే కంటిన్యు అవుతున్నానని, ఇకముందు కూడా కంటిన్యు అవుతానని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా కాంగ్రెస్ లోనే ఉన్న తనలాంటి సీనియర్ నేతపై ఇలాంటి దుష్ర్రాచారం చేయటం తగదని వాపోయారు.

తాను గాంధీ ఫ్యామిలీకి వీర విధుయుడనని చెప్పుకున్నారు. తనతో పాటు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ముఖ్యమంత్రి కేసీయార్ తో ఫొటో దిగినట్లు కావాలనే ప్రచారం చేస్తున్నట్లు మండిపోయారు. కేసీయార్ కు చెరోవైపు తామిద్దరం నిలబడి ఫోటోలు తీయించుకున్నట్లు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నట్లు తన ఫిర్యాదులో వీహెచ్ చెప్పారు.

ఎప్పుడైతే మార్ఫుడు ఫొటో సోషల్ మీడియాలో కనబడిందో అప్పటినుండే తన మద్దతుదారుల నుండి ఫోన్లు వస్తున్నట్లు మండిపడ్డారు. టీఆర్ఎస్ లో ఎప్పుడు చేరుతున్నారో చెప్పాలంటు తనకే ఫోన్లు చేసి అడగటం తనను అవమానించటమే అని వీహెచ్ వాపోయారు.

ఇలాంటి దుష్ర్పచారం ఎలా జరుగుతోంది ? దీని వెనుక ఎవరున్నారనే విషయమై వెంటనే విచారణ జరిపి నిజాలను బయటపెట్టాలని వీ హెచ్ డిమాడ్ చేశారు. తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ర్పచారం తన రాజకీయ జీవితంపై మరకలాంటిదని వీహెచ్ వాపోయారు.
Tags:    

Similar News