ఎన్నికలు వస్తున్నాయనంటే నాయకుల సందడే వేరు. ఓట్ల కోసం ప్రజలను ప్రసన్నం చేసుకుంటారు, అంతకు ముందుగా సీట్ల కోసం అధినేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తుంటారు. అయితే పెద్దల సభ అయిన రాజ్యసభకు ఓట్లేసేది ఎమ్మెల్యేలు కాబట్టి వారిని బుట్టలో వేసుకోవాలంటే సదరు పార్టీ అధినేతలే కీలకం. ఈ క్రమంలో త్వరలో పదవీ కాలం ముగియనున్న కాంగ్రెస్ ఎంపీ వీహెచ్ తన ప్రయత్నాన్ని కొత్తగా మొదలుపెట్టారు.
త్వరలో జరగనున్న పెద్దల సభ ఎన్నికల్లో తాను కాంగ్రెస్ తరఫున బరిలోకి దిగుతానని చెప్పిన వీహెచ్...తనకు మద్దతివ్వాల్సిందిగా టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ను కోరారు. తనకే ఎందుకు మద్దతు ఇవ్వాలో ఆ లాజిక్ కూడా వీహెచ్ చెప్పారు. గతంలో టీఆర్ ఎస్ తరఫున కేకేను బరిలోకి దింపినపుడు కాంగ్రెస్ మద్దతిచ్చిందని గుర్తుచేస్తూ ఇపుడు తన విషయంలో సేమ్ టు సేమ్ బలపర్చే విధానాన్ని ఫాలో కావాలని కోరారు. అంతేకాదు తనను ఎంపీగా గెలిపించడం వల్ల సోనియాగాంధీ సైతం తెలంగాణ బిడ్డను గౌరవించారని ఫీలవుతారని వీహెచ్ సూత్రీకరించారు. మీడియా ముఖంగా అడుగుతున్నానని కేసీఆర్ అనుకోవక్కర్లేదని చెప్తూ....కావాలంటే కేసీఆర్ ను స్వయంగా కోరుతానని చెప్పారు.
ఈ ఎపిసోడ్ లో మరో రెండు ట్విస్ట్ లున్నాయండోయ్. వీహెచ్ పదవి ఊడిన తర్వాత ఢిల్లీలో ఆయన ఖాళీ చేసే క్వార్టర్ ను తనకు కేటాయించాలని ఇప్పటికే కేకే తన వినతిపత్రాన్ని సంబంధిత అధికారులకు ఇచ్చారు. ఇంకో అంశం ఏమిటంటే...కేసీఆర్ కూతురు - ఎంపీ కవిత మహిళా దినోత్సవం సందర్భంగా సోనియాగాంధీని కీర్తిస్తు మాట్లాడారు. పరిస్థితి చూస్తుంటే మరోమారు కాంగ్రెస్-టీఆర్ ఎస్ లు అంశాల ప్రాతిపదికన అయినా దగ్గర అవుతారా అనే చర్చ పొలిటికల్ సర్కిల్ లో సాగుతోంది.