అతి త్వరలో వ్యాక్సిన్​.. వారికే తొలి ప్రాధాన్యం !

Update: 2020-11-20 05:30 GMT
కరోనా వ్యాక్సిన్​పై దేశప్రజలంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న వేళ కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు. మనదేశంలోకి రెండు లేదా మూడు నెలలలోపు వ్యాక్సిన్​ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందన్నారు. గురువారం ఆయన ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ వెబినార్ లో 'ది షిఫ్టింగ్ హెల్త్‌కేర్ పారాడిగ్మ్ డ్యూరింగ్ అండ్ పోస్ట్-కోవిడ్' పై అనే అంశంపై ప్రసంగించారు. ఈ  సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనాపై పోరాడిన వారియర్స్​కి  తొలి ప్రాధాన్యమిస్తారని చెప్పారు. ఆ తర్వాత వృద్ధులు, చిన్నపిల్లలకు టీకాలు వేస్తామని చెప్పారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్రప్రభుత్వం ఎంతో పకడ్బందీ చర్యలు తీసుకున్నదన్నారు. అన్ని వర్గాల ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.

2021 మనందరికీ మంచి సంవత్సరంగా ఉండాలని , కరోనా నివారణ విషయంలో ఆశాజనకమైన ఫలితాలు రావాలని ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్ధన్ పేర్కొన్నారు. 2021 జూలై-ఆగస్టు నాటికి 25-30 కోట్ల మందికి 400-500 మిలియన్ మోతాదులు అందుబాటులోకి వస్తాయన్నారు. వచ్చే ఏడాది మార్చి , ఏప్రిల్ నెలల్లో మన ఏం చేయాలన్న దానిపై ఇప్పటి నుండే ప్రణాళికలు ప్రారంభించామని మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. అయితే ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండాలని వ్యాక్సిన్​ వచ్చే వరకు మాస్కులు ధరించి, భౌతికదూరంగా పాటించాలని కోరారు.

 ప్రస్తుతం వ్యాక్సిన్లకు ట్రయల్స్​ కొనసాగుతున్నాయి. సీరం ఇన్​స్టిట్యూట్​, ఆక్స్​ఫర్డ్​ వ్యాక్సిన్  కు మూడో దశ ట్రయల్స్​ కొనసాగుతున్నాయి. భారత్ బయోటెక్ మరియు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) వారి వ్యాక్సిన్​కు సంబంధించిన మూడో దశ క్లినికల్ ట్రయల్ ప్రారంభమైంది. డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ తీసుకురానున్న స్పుత్నిక్ వీ వ్యాక్సిన్​ ట్రయల్స్​ కూడా త్వరలో జరుగనున్నాయి. వీటితోపాటు బయోలాజికల్ ఈ లిమిటెడ్ తన కరోనా వ్యాక్సిన్ యొక్క మొదటి రెండు దశల క్లినికల్ ట్రయల్స్ ను ప్రారంభించింది. మరోవైపు అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ మెరుగైన ఫలితాలు చూపిస్తున్నది.
Tags:    

Similar News