క్రిస్మ‌స్ పండుగ‌కు ముందే భారత్ లో వ్యాక్సిన్ !

Update: 2020-12-11 12:26 GMT
కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ కోసం ప్రతి ఒక్కరు కూడా కళ్లలో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే యూకే ఫైజర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వ్యాక్సినేషన్ ను కూడా ప్రారంభించింది. ఈ సమయంలో దేశంలో వ్యాక్సినేషన్ కోసం ఎదురుస్తున్న ప్రజలు సీరంకు యూకే డ్రగ్ రెగ్యులేటర్ ఆమోదం కీలకంగా మారనుంది. యూకే, బ్రెజిల్ దేశాల్లోని కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌, ఆమోదం లాంటి అంశాలను భారత ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటున్న నేపథ్యంలో ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ను తయారు చేస్తున్న సీరంకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే దేశీయంగా అత్యవసర వినియోగానికి అనుమతి పొందే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో న్యూ ఇయర్ కి వారం ముందే దేశీయంగా కూడా అనుమతి వస్తుందని అధికారులు భావిస్తున్నారు.

తాజా నివేదికల ప్రకారం మెడిసిన్స్ అండ్ హెల్త్ ‌కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ ప్రస్తుతం ఆస్ట్రాజెనెకా-ఆక్స్ ‌ఫర్డ్‌ కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ ఫలితాలను, సామర్ధ్యాన్ని, మోతాదులను అంచనా వేస్తోంది. దీంతో న్యూ ఇయర్ కి ‌వారం ముందే ఎంహెచ్ ‌ఆర్‌ ఎ ఆమోదం వచ్చే అవకాశం ఉందని, ఆ తర్వాత వెంటనే దేశీయంగా కూడా అనుమతి లభించనుందని రెగ్యులేటరీ వర్గాలు వెల్లడించినట్టు సమాచారం. భారతదేశంలో అత్యవసర వినియోగ అధికారానికి సంబంధించిన సీరం అభ్యర్థనను ఆమోదించేందుకు యూఏ రెగ్యులేటరీ ఆమోదం చాలా కీలకమని ఒక అధికారి తెలిపారు.

యూకే బ్రెజిల్‌లో జరుగుతున్న ట్రయల్స్‌ ఆధారంగా ప్రతిపాదన ఉంటుందనీ, అంతేకాకుండా, టీకా ఇంకా ఏ దేశంలోనూ ఆమోదించబడలేదు. ఇది సున్నితమైన విషయమన్నారు. టీకా భద్రత, సమర్థత ,రోగనిరోధక శక్తిపై తమకు ఖచ్చితంగా తెలిస్తేనే, అనుమతి ఇవ్వగలమని అధికారి చెప్తున్నారు. మరోవైపు కరోనా వ్యాక్సిన్లను పరిశీలించే ప్రభుత్వ ప్యానెల్ సబ్జెక్ట్ ఎక్స్‌ పర్ట్ కమిటీ దేశంలో 2, 3 దశల మానవ క్లినికల్ ట్రయల్స్ అప్‌ డేటెడ్ సేఫ్టీ డేటాతో పాటు యుకెలో ట్రయల్ ఇ‍మ్యూనోజెనిసిటీ డేటాను కూడా సమర్పించాలని సీరంను కోరింది. భారతదేశంలో అత్యవసర వినియోగ ప్రామాణీకరణ ఆమోదం పొందాలంటే ఎంహెచ్‌ ఆర్ ‌ఎ ఆమోదానికి సంబంధించిన వివరాలను సీరం సంస్థ తప్పనిసరిగా అందించాలని ప్యానెల్ తెలిపింది.
Tags:    

Similar News