కొవిడ్ వల్ల ప్రపంచవ్యాప్తంగా సంభవించిన పెనుమార్పుల గురించి అందరికీ తెలుసు. కాగా, కరోనా ఫస్ట్, సెకండ్ వేవ్ మానవాళిని అతలాకుతలం చేసింది. త్వరలోనే థర్డ్ వేవ్ రాబోతుందంటూ నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి. మాస్కు ధరించడంతో పాటు తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.
అర్హులైన ప్రతీ ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది. అయితే, థర్డ్ వేవ్‌లో పెద్దల కంటే కూడా పిల్లలపైనే ఎక్కువగా ఎఫెక్ట్ ఉండే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అదేంటంటే.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వ్యాక్సినేషన్ ప్రక్రియ 18 ఏళ్లకు పైబడిన వారికి కొనసాగుతోంది.
ఈ నేపథ్యంలో సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ టీకాలు తీసుకుంటున్నారు. థర్డ్‌వేవ్ రాకముందే మందస్తు చర్యల కింద పిల్లలకు కూడా వ్యాక్సిన్ ఇవ్వడం మంచిదే. అయితే, వారికి ఇచ్చే టీకాల వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండకుండా జాగ్రత్తపడాలి. ఈ క్రమంలోనే చిల్డ్రన్స్‌కు వ్యాక్సిన్ ఇచ్చేందుకు క్లినికల్ ట్రయల్స్ ముమ్మరంగా సాగుతున్నాయి.
కాగా, కేంద్రప్రభుత్వం ఈ విషయంలో పిల్లలకు గుడ్ న్యూస్ చెప్పింది. జైడస్ క్యాడిల్లా అనే సంస్థ రూపొందించిన డీఎన్ఏ ఆధారిత జైకోవ్-డీ (ZyCoV-D) కొవిడ్ టీకా 12 నుంచి 18 ఏళ్ల వారికి ఉపయోగించేందుకు గాను క్లినికల్ ట్రయల్స్ పూర్తి చేసినట్లు కేంద్రం ప్రభుత్వం పేర్కొంది. క్లినికల్ ట్రయల్స్ ప్రక్రియ పూర్తయినందున త్వరలో టీకా అందజేయనున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయాలను కేంద్రం ఎవరికి తెలిపిందంటే..
థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న సందర్భంలో 12-17 ఏళ్ల వయసున్న పిల్లలకు వెంటనే వ్యాక్సిన్ వేయాలని కోరుతూ టియా గుప్తా అనే బాలుడు ఢిల్లీ కోర్టులో పిటిషన్ వేశాడు. పిటిషన్ విచారణ సందర్భంగా కేంద్రం పై వివరాలను అఫిడవిట్ రూపంలో హైకోర్టుకు సమర్పించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సత్యేంద్ర సింగ్ వివరాలు వెల్లడించారు.
గుజరాత్ అహ్మదాబాద్‌లోని జైడస్ క్యాడిల్లా అనే సంస్థ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ చట్టబద్ధమైన ఆమోదం పొందేందుకు సిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ డీఎన్ఏ వ్యాక్సిన్ ట్రయల్స్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ కాగా, త్వరలో అందరికీ అవెయిలబుల్‌గా ఉంటుంది ఈ టీకా.
ఈ టీకాకు రెగ్యులేటరీ అనుమతులూ మంజూరు చేయనున్నట్లు కేంద్రం పేర్కొంది. తద్వారా చిన్నారులకు రక్షణ కలుగుతుందని కేంద్రం భావిస్తోంది. అయితే, దేశవ్యాప్తంగా ప్రస్తుతం కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ కంటే కూడా స్పీడ్‌గా పిల్లలకు టీకాలు వేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఒక్కసారి థర్డ్ వేవ్ షురూ అయితే కంట్రోల్ చేయడం ఎవరి చేతుల్లో ఉండదని హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉండగా దేశవ్యాప్తంగా ప్రస్తుతం టీకాపై ఉన్న పలు అపోహలు, అనుమానాలు కొంత వరకు తొలగిపోయాయి. గ్రామం నుంచి మొదలుకుని సిటీ వరకూ టీకాలు వేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ క్రమంలోనే మొదటి డోసు తీసుకుని రెండో డోసు కోసం వెయిట్ చేస్తున్న వారి సంఖ్య బాగానే ఉంది. వారికి రెండో డోసు వ్యాక్సిన్లు అందించడంతో పాటు పిల్లలకు ఈ వ్యాక్సిన్ ఇచ్చేందుకు గాను వైద్యారోగ్య శాఖ, ఇతర శాఖలను సమన్వయం చేసుకోవాల్సి ఉంటుంది.