వంగవీటిపై హెచ్.ఆర్.సి. కి ఫిర్యాదులు!

Update: 2016-12-24 12:06 GMT

వంగవీటీ సినిమా టైటిల్ ప్రకటించినప్పటినుంచీ మీడియాలో నానుతూనే ఉన్న సంగతి తెలిసిందే. వర్మ తన సినిమాల్లో కథకు, కథనానికి, క్యాస్టింగ్ కి ఎంతప్రాధాన్యత ఇస్తారో పబ్లిసిటీకి అంతకు మించిన పబ్లిసిటీ ఇస్తారనడంలో సందేహంలేదు. ఇదే క్రమంలో అదే స్థాయి పబ్లిసిటీతో తాజాగా విడుదలైంది "వంగవీటి". ఈ సినిమా డివైడ్ టాక్ తెచ్చుకుందని కొందరంటుంటే... వంగవీటి అభిమానులను పూర్తిగా నిరాశపరుస్తూ, వాస్తవాలకు చాలా దూరంగా ఉంది అని మరికొందరు చెబుతున్నారు. ఆ సంగతులు అలా ఉంటే... తాజాగా మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించింది వంగవీటి రంగా అభిమాన సంఘం.

రాం గోపాల్ వర్మ దర్శకత్వంలో విడుదలైన "వంగవీటి" చిత్రంలోని పలు సన్నివేశాలు తమ మనోభావాలను కించపరిచేలా ఉన్నాయంటూ కాపు సామాజిక వర్గానికి చెందిన నేతలు హ్యూమర్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేశారు. అలా ఉన్న సన్నివేశాలన్నీ తొలగించాలని కోరారు.

ఇలా రంగా అభిమానులు ఇచ్చిన ఫిర్యాదుపై వెంటనే స్పందించిన హ్యూమన్ రైట్స్ కమిషన్.. జనవరి 16లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని సెన్సార్‌ బోర్డును ఆదేశించింది. అలాగే "వంగవీటి" సినిమాపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ శుక్రవారం ఏపీ డీజీపీ సాంబశివరావుని కలిశారు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ. విడుదలకు ముందు తాము చెప్పిన అభ్యంతరాలను వర్మ ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని, ఆ దృశ్యాలను వెంటనే తొలగించాలని విజ్ఞప్తి చేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News