వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ పేరిట వచ్చిన న్యూడ్ వీడియో ఫేక్ ది అని అనంతపురం పోలీసులు నిర్ధారించారు. పైగా అది చాలా సార్లు ఎడిటింగ్ జరిగిందని కూడా పేర్కొన్నారు. దీని మీద ఇపుడు అతి పెద్ద రచ్చ సాగుతోంది. తాను కడిగిన ముత్యమని ఎంపీ గోరంట్ల మాధవ్ అంటూంటే ఆయన ఒక డర్టీ ఎంపీ అని టీడీపీ ఫైర్ బ్రాండ్ లేడీ తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అంటున్నారు. ఇక ఫేక్ వీడియో అని చెప్పడానికి పోలీసులు ఫోరెన్సిక్ నిపుణులా అని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సెటైర్లు వేశారు.
ఇదిలా ఉంటే తాను మొదటి నుంచి తప్పు చేయలేదని ధీమాగా ఉన్నాను అని అనంతపురం ఎస్పీ ప్రెస్ మీట్ తరువాత ఢిల్లీలో గోరంట్ల మాధవ్ చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు లోకేష్ సహా అందరినీ దారుణంగా విమర్శించారు. ఇక టీడీపీ అనుకూల మీడియాను అయితే భాషలో చెప్పరాని విధంగా విమర్శించారు. అంతా కలసి కుట్ర పన్ని తన మీద పడ్డారు అని అన్నారు.
ఏబీఎన్ రాధాక్రిష్ణ, టీవీ 5 బీయార్ నాయుడు నేల ముక్కుకు రాయాలని, క్షమాపణకు చెప్పాలని కూడా గోరంట్ల డిమాండ్ చేశారు. చంద్రబాబు నీచపు రాజెకీయలకు ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన హెచ్చరించారు. తన పేరు మీద వచ్చిన వీడియో మాఫింగ్ అని మొదటి నుంచి చెబుతున్నదే నిజమైంది అని ఆయన అన్నారు. తన మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడిన అందరి మీద పరువు నష్టం దావా వేస్తాను అని మాధవ్ అనడం విశేషం.
ఇదిలా ఉండగా నారా లోకేష్ అనంతపురం ఎస్పీ ఫకీరప్ప ఫేక్ వీడియో అనడం మీద మండిపడ్డారు. ఇది ఫేక్ అని మీరు అంటున్నారు అంటే ఒరిజినల్ వీడియో ఒకటి ఉందని నమ్ముతున్నారా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇక ఫేక్ అవునో కాదో ఫోరెన్స్కిన్ నిపుణులు తేల్చుతారని కూడా లోకేష్ అనడం విశేషం.
ఇక మరో వైపు చూస్తే టీడీపీ ఫైర్ బ్రాండ్, తెలుగు మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత మాట్లాడుతూ ఆయనో డర్టీ ఎంపీ. ఆయన్ని సమర్ధించేవారంతా కూడా తలదించుకోకతప్పదని అన్నారు. వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో ఫేక్ ది అని అనంతపురం ఎస్పీ ఫకీరప్ప మీడియా మీట్ లో చెప్పడాన్ని ఆమె తప్పు పట్టారు.
అసలు అది ఫేక్ వీడియో అని పోలీసులు ఎలా చెబుతారు అని ప్రశ్నించారు. అది ఒరిజినలా కాదా అన్నది నిర్దారించలేకపోతున్నామని పోలీసులు చెప్పడం వరకూ ఓకే కానీ ఫేక్ వీడియో అని ఏకంగా చెప్పడమేంటని మండిపడ్డారు. మీరు నిర్ధారించనంతమాత్రాన అది ఫేక్ వీడియో అయిపోతుందా అని అనిత అనడం విశేషం.
అంటే ఫకీరప్ప న్యూడ్ వీడియో ఫేక్ అని చెప్పిన మీదట మరింతగా ఈ వివాదం రాజుకుంది. రచ్చ ఇంకా పెద్దది అవుతోంది. మరిపుడు ఇది ఎపుడు చల్లారుతుందో ఎవరికీ తెలియదు. ఇంకో వైపు టీడీపీ వారే ఇండీసెంట్ బిహేవియర్ చేస్తున్నారు అని వైసీపీ నేతలు అనడం విశేషం.