ఆయన మళ్లీ చంద్రబాబుకు దగ్గరవుతున్నారా?

Update: 2020-12-18 17:11 GMT
అమరావతి సాక్షిగా ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. అమరావతి రాజధాని ఉద్యమానికి వచ్చిన టీడీపీ అధినేత చంద్రబాబును మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ కలవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒకప్పుడు టీడీపీకి బద్ద శత్రువుగా ఉండే వంగవీటి ఫ్యామిలీ అనంతర పరిణామాల్లో టీడీపీలో చేరింది. ఆ తర్వాత మొన్నటి ఎన్నికల్లో వంగవీటి గెలవకపోవడంతో సైలెంట్ అయ్యారు.

తాజాగా చాలా రోజుల తర్వాత చంద్రబాబును వంగవీటి కలిసి మాట్లాడుకున్నారు. తెలుగు తమ్ముళ్లు ఈ ఇద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ చేశారు.

వైసీపీపై వంగవీటి ఈ సందర్భంగా మండిపడ్డారు. అమరావతి ఒక కులం వారిది మాత్రమేనని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని.. కావాలంటే తన కులం ఏమిటో చెక్ చేసుకోవాలని వంగవీటి మండిపడ్డారు. తాను దివంగత రంగా గారి అబ్బాయిని అని.. రాష్ట్రం కోసం పోరాడుతానని వంగవీటి అన్నారు. రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసి జగన్ ఆడుకుంటున్నాడని రాధాకృష్ణ మండిపడ్డారు.

2014 ఎన్నికలకు ముందు వైసీపీకి గుడ్ బై చెప్పి వంగవీటి టీడీపీలో చేరారు. రాష్ట్ర వ్యాప్తంగా కాపు నేతల కోసం ప్రచారం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాన్ కలిసినా ఆపార్టీలో చేరలేదు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లోనూ యాక్టివ్ రోల్ పోషించలేదు. పార్టీ కోసం పనిచేశారు. అప్పటి నుంచి సైలెంట్ గా ఉంటున్న వంగవీటి రంగా తాజాగా చంద్రబాబును కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
Tags:    

Similar News