దత్తన్న ప్లేసులో వెదిరె శ్రీరామ్

Update: 2017-09-02 14:43 GMT
మోడీ కేబినెట్ విస్తరణ దెబ్బకు మంత్రి పదవి పోగొట్టుకున్న తెలంగాణ సీనియర్ లీడర్ దత్తాత్రేయ స్థానంలో తెలంగాణకు చెందిన మరో నేత పేరు వినిపిస్తోంది.  ఆదివారం జ‌ర‌గనున్న ఈ మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ గురించి దేశ‌వ్యాప్తంగా రాజ‌కీయ విశ్లేష‌కులు, వార్తా ఛాన‌ళ్ల ప్ర‌తినిధులు వేస్తున్న అంచనాల్లో కొత్త పేరు వినిపిస్తోంది. కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖ స‌ల‌హాదారుగా.. అలాగే రాజస్థాన్ రివర్ బేసిన్ అండ్ వాటర్ రిసోర్సెస్ ప్లానింగ్ అథారిటీ ఛైర్మన్ గా కీలక బాధ్యతల్లో ఉన్న తెలంగాణకు చెందిన వ్యక్తి వెదిరె శ్రీరామ్ పేరు వినిపిస్తోంది.
    
వెదిరె శ్రీరామ్‌ భువనగిరి ప్రాంతానికి చెందిన వ్యక్తి. రాజస్థాన్ లో జల సంరక్షణ విషయంలో ఆయన చేసిన కృషికి మోడీ ప్రశంసలు కూడా దక్కాయి. ప్రధాని తన మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా మోడీ ఒకసారి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే గంగా ప్రక్షాళన ప్రాజెక్టులోనూ శ్రీరామ్ ది కీలక పాత్రే. ఈ నేపథ్యంలోనే మోడీ దృష్టిలో ఉన్న ఆయనకు మంత్రి పదవి దక్కవచ్చన్న అంచనాలు ఢిల్లీ మీడియా వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.
    
అయితే... దీనిపై బీజేపీ వర్గాల నుంచి కానీ.. వెదిరె శ్రీరాం నుంచి కానీ దీనిపై క్లారిటీ లేదు. ఈ రోజు రాత్రి ఏ సమయానికైనా శ్రీరాం పేరు విషయంలో స్పష్టత రావొచ్చని భావిస్తున్నారు. తెలంగాణ బీజేపీకి కొత్త రక్తం ఎక్కించడంతో పాటు కేంద్రంలో శ్రీరాం వంటి సమర్థుల సేవలు ఉపయోగించుకోవడం కూడా అవసరం అన్న దృష్టితో ఆయన పేరు పరిశిలిస్తున్నట్లు తెలుస్తోంది.
Tags:    

Similar News