సంక్రాంతికి రిలీజ్ అయిన నట సింహం నందమూరి బాలక్రిష్ణ మూవీ వీర సింహారెడ్డి సినిమా జనాలను ఆకట్టుకుంటోంది. ఈ మూవీ విశేషాలు ఏంటి అంటే యాక్షన్ తో పాటు భారీ డైలాగులు అని అంటున్నారు. మాటల రచయిత బుర్రా సాయి మాధవ్ రాసిన ఈ డైలాగులలో అధిక భాగం పొలిటికల్ పంచులతో నింపేశారు అని అంటున్నారు.
ఈ డైలాగులు వెండి తెర మీద బాలయ్య పాత్ర ద్వారా వస్తున్నపుడు మంచి రెస్పాన్స్ వస్తోంది అని అంటున్నారు. నేరుగా వైసీపీ ప్రభుత్వాన్ని గురి పెట్టినట్లుగా ఈ డైలాగులు ఉన్నాయని అంటున్నారు. అభివృద్ధి అంటే కూల్చుడు కాదు నిర్మాణాలు అని బాలయ్య అ పేల్చిన డైలాగు ఎవరి మీదనో అర్ధం చేసుకోలేని స్థితిలో ఆడియన్స్ లేరు అంటున్నారు.
అలాగే ఒక్క సంతకం డైలాగ్ కూడా రచ్చ రేపుతోంది. ఒక్క సంతకంతో బోర్డులు మార్చవచ్చు కానీ చరిత్రను మార్చలేరు అంటూ బాలయ్య చెప్పినది కూడా బాగా పేలుతోంది. దీని మీద మాజీ మంత్రి పేర్ని నాని కూడా మీడియా సమావేశంలో సెటైర్లు వేశారు. ఆ ఒక్క జగన్ సంతకమే వీర సింహారెడ్డి సినిమాకు పది రోజుల పాటు రేట్లు పెంచుకునే అవకాశం ఇచ్చిందని దెప్పి పొడించారు. జగన్ కి కనుక కక్ష ఉంటే అసలు అదనపు రేట్లకు అనుమతి ఇవ్వరని కూడా స్పష్టం చేశారు.
ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రభుత్వ వ్యతిరేక డైలాగులు ఉన్నాయన్న సమాచారంతో ఏపీ ప్రభుత్వ అధికారులు విజయవాడలో ఈ సినిమాను గత రాత్రి చూశారు అని అంటున్నారు. ఈ సినిమాలో ప్రభుత్వ వ్యతిరేక డైలాగులు ఉన్నాయని ప్రభుత్వం ఒక నిర్ధారణకు వచ్చిందని అంటున్నారు.
అయితే ఈ సినిమాలో డైలాగులు డైనమేట్లుగా పేలుతున్నాయి. ఏమి చేయాలో మాత్రం వైసీపీ పెద్దలకు అర్ధం కావడం లేదు అంటున్నారు. నిజానికి గతంలో అయితే సెన్సార్ బోర్డు ఇలా ప్రభుత్వ వ్యతిరేక డైలాగులు ఉంటే కట్స్ చెప్పేవారు. అలా ఎన్టీయార్ బొబ్బిలి పులి సినిమాకు ఎన్నో కట్స్ పెట్టారు. క్రిష్ణ నటించిన రాజకీయ చిత్రాలకు అలాగే కట్స్ వేసేవారు.
అయితే వీర సింహారెడ్డి సినిమా లో డైలాగ్స్ విషయంలో లైట్ తీసుకున్నారు అని అంటున్నారు. అయితే కధను అనుసరించి ఈ డైలాగులు ఉండడం వల్ల కూడా ఏమీ చేయలేకపోయి ఉండవచ్చు అంటున్నారు. అయితే కధ ఏమైనా ఏపీ రాజకీయాలల్తో వర్తమాన పరిస్థితుల్లో ఈ డైలాగులు బాగా సింక్ అవుతున్నాయి. అంతే కాదు ఈ డైలాగులను తెలుగుదేశం వారు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ పెడుతూ వైరల్ చేసి పారేస్తున్నారు.
ఇంత జరుగుతున్నా వైసీపీ సర్కార్ పెద్దలు ఏమీ చేయలేని పరిస్థితి ఉంది అంటున్నరు. మాజీ మంత్రి పేర్ని నాని మాటలను బట్టి చూస్తే మాత్రం సర్కార్ సీరియస్ గానే ఉంది అంటున్నారు. కానీ ఏమి చేస్తారో తెలియడం లేదు. కొన్నాళ్ళు చూస్తే సంక్రాంతి సందడి తగ్గాక అంతా సర్దుమణిగిపోతుంది అని వేచి చూసే ధోరణిలో ఉంటారా అన్న చర్చ కూడా సాగుతోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.