ఎమ్మెల్యేగా, ఎంపీగా, కేంద్ర కేబినెట్ మంత్రిగా, బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా, ఉపరాష్ట్రపతిగా వెంకయ్య నాయుడు అనేక కీలక బాధ్యతలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఆగస్టులో ఉపరాష్ట్రపతిగా తన పదవీకాలాన్ని ముగించుకున్న వెంకయ్య నాయుడుకు మరోమారు రెన్యువల్ దొరుకుతుందన్న వార్తలు వచ్చినా నిజం కాలేదు. అలాగే ఆయనే బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి అవుతారని ఆశించినా అవి వాస్తవ రూపం దాల్చలేదు.
ఇక ఉపరాష్ట్రపతిగా తన పదవీకాలాన్ని ముగించుకున్న వెంకయ్య నాయుడు ప్రస్తుతం తన చిన్ననాటి స్నేహితులను, కుటుంబ మిత్రులను, తన రాజకీయ సహచరులను కలుస్తూ గత స్మృతులను నెమరువేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వివిధ విద్యా సంస్థలు, తన మిత్రులు ఏర్పాటు చేస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కోసం ఏపీలో ఆయన రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఆయన చురుగ్గా పర్యటిస్తున్నారు. ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో వెంకయ్య నాయుడు భవిష్యత్ తరాలకు కావాల్సిన సూచనలు, సలహాలు అందజేస్తున్నారు. అలాగే తన చిన్ననాటి సంగతులను, రాజకీయ రంగ ప్రవేశం నాటి విశేషాలను పంచుకుంటున్నారు. మాతృభాష గొప్పతనం, మాతృభాష బోధనలో మేలు గురించి వివరిస్తున్నారు.
ఈ ఆత్మీయ సమ్మేళనాలకు పార్టీలకతీతంగా నేతలు హాజరవుతుండటం విశేషం. కేవలం బీజేపీ నేతలే కాకుండా వివిధ రంగాల ప్రముఖులు, వైఎస్సార్సీపీ, టీడీపీ, బీజేపీ, జనసేన ఇలా వివిధ రాజకీయ పక్షాల నేతలు సైతం హాజరవుతున్నారు. వెంకయ్య నాయుడు చెప్పే మాటలను శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఇప్పటికే వివిధ ఆత్మీయ సమ్మేళనాలకు హాజరైన వెంకయ్య తాజాగా విజయవాడలో తన స్నేహితులు నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సమావేశానికి ఏపీలోని మూడు ప్రధాన పార్టీలకు చెందిన కీలక నేతలు హాజరు కావడం విశేషం. టీడీపీకి చెందిన విజయవాడ ఎంపీ కేశినేని నాని, వైఎస్సార్సీపీ నేత దేవినేని అవినాష్, బీజేపీకి చెందిన మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు ప్రసంగిస్తూ.. ఈ కార్యక్రమం ద్వారా పలువురు మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, నిష్ణాతులను కలవడం ఎంతో ఆనందంగా ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
చట్ట సభల్లో విమర్శల కంటే తిట్ల దండకం ఎక్కువైపోయిందని వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తకాలు.. కాగితాలు చించితే చొక్కాలను చించుకున్నట్టేనని చెప్పారు. తానూ ఎమ్మెల్యేగా ఉన్నానని.. అయితే ఏ రోజూ పోడియం వద్దకు వెళ్లలేదని వివరించారు. చట్టసభల్లో మాట్లాడేటప్పుడు కొంత హాస్యం ఉండాలని.. సబ్జెక్టు ఉండాలని సూచించారు. హ్యూమర్ ఉండాలి.. గ్రామర్ కూడా ఉండాలని ఛలోక్తులు విసిరారు. విమర్శలు చేయవచ్చు.. ఎండగట్టొచ్చు.. కానీ దూషణలకు దిగకూడదని హితవు చెప్పారు. రాజకీయ పార్టీలు తమ సభ్యులకు స్వచ్ఛంద ప్రవర్తనా నియామవళి రూపొందించాలని హితవు పలికారు. చట్ట సభల హుందా పెరగాలంటే.. రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలని కోరారు.
రాజ్యసభలో మాట్లాడేందుకు సభ్యులకు తాను ఇచ్చిననన్ని అవకాశాలు మరెవ్వరూ ఇవ్వలేదని వెంకయ్య నాయుడు గుర్తు చేశారు. సభ నుంచి తమ సభ్యులు సస్పెండ్ కావాలని పార్టీ అధినాయకులు కూడా కోరుకుంటున్నారని.. అప్పుడే మీడియా కవరేజ్ వస్తోందని భావిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉప రాష్ట్రపతి పదవి నుంచి దిగిపోయాక తనకు స్వతంత్రం వచ్చినట్లుగా ఉందని తెలిపారు. ఉప రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ఎవర్నైనా కలవడానికి ప్రొటోకాల్ తో కొన్ని ఇబ్బందులు ఉండేవన్నారు. అయితే ఇప్పుడు ఎవర్నైనా.. ఎప్పుడైనా కలిసే అవకాశం ఉందని సంతోషం వ్యక్తం చేశారు. అందర్ని కలవడం.. చక్కగా తినడం తనకు చాలా ఇష్టమైన పనులు అన్నారు. పునుగులు.. మసాలా వడలు తినడం తనకు ఇష్టమని చెప్పారు. అలాగే విజయవాడలోని బాబాయ్ హోటల్లో ఇడ్లీ తినడం ఇష్టమని తెలిపారు.
ఉప రాష్ట్రపతి కాక ముందు ఎక్కడ ఫుడ్ బాగుంటే అక్కడ ఆగి తినేవాడినని గుర్తు చేసుకున్నారు. ఉప రాష్ట్రపతి అయ్యాక.. తాను తినాలంటే ముందుగా ఓ నలుగురు తినాల్సి ఉంటుందన్నారు. ఉప రాష్ట్రపతిగా కంటే.. ముప్పవరపు వెంకయ్య నాయుడుగానే తనను గుర్తు పెట్టుకోవాలని కోరారు. మాతృ భాషపై పట్టు సాధించాలని.. ఫస్ట్ మదర్ టంగ్.. నెక్స్ట్ బ్రదర్ టంగ్.. ఆ తర్వాతే అదర్ టంగ్ అని ఛలోక్తులు విసిరారు.
కుల, మతం, క్రిమినల్ రికార్డులున్న వాళ్లకే రాజకీయాలు అన్నట్టుగా పరిస్థితి మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. హక్కుల గురించే కాదు.. బాధ్యతలు గురించి ఆలోచన చేయాలని సూచించారు. రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులే కాకుండా ప్రాథమిక విధులు కూడా ఉన్నాయని గుర్తు చేశారు.