వెంక‌య్య..ద‌త్త‌న్న అంటున్న బీజేపీ పెద్ద‌లు

Update: 2017-09-17 16:41 GMT
రాజ‌కీయాల్లో లెక్క‌లు చాలా ఆస‌క్తిక‌రంగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే చిత్రంగా ఉంటాయి. అనుకున్న‌ది అనుకున్న‌ట్లుగా అస‌లే జ‌ర‌గ‌దు. పైగా పైకి క‌నిపించే దాని వెనుక లెక్క‌లు వేరే ఉంటాయి. ఇప్పుడు అలాంటి లెక్క‌ల‌నే తెలుగు రాష్ర్టాల బీజేపీ నేత‌ల విష‌యంలో జ‌రుగుతుందంటున్నారు. అదే తెలుగు రాష్ర్టాల్లో ఓ వెలుగువెలిగిన బీజేపీ అగ్ర‌నేత‌లు వెంక‌య్య‌నాయుడు - బండారు ద‌త్తాత్రేయ‌.

కేంద్ర మంత్రి వెంక‌య్య‌నాయుడు బీజేపీ సీనియ‌ర్ నేత అయిన‌ప్ప‌టికీ తెలుగుదేశం ప్ర‌యోజ‌నాల కోస‌మే ఢిల్లీలో ఎక్కువ‌గా గ‌ళం వినిపించేవార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ప్ర‌చారం ఉంది. అయితే అదే రీతిలో బీజేపీని మాత్రం ప‌ట్టించుకోలేద‌ని ప‌లువురు అంటుంటారు. ఈ స‌మాచారామే బీజేపీ పెద్ద‌ల దృష్టికి వెళ్లింద‌ని, దీంతో పాటుగా ఏపీ స‌ర్కారు అవినీతి కూడా త‌మ దృష్టికి తీసుకురాక‌పోవ‌డంతో ఆయ‌న్ను ప‌ద‌వి నుంచి త‌ప్పించార‌నే టాక్ ఉంది. అయితే గౌర‌వ ప్ర‌దంగా ఉండాల‌ని క్రియాశాల రాజ‌కీయాల‌తో సంబంధం లేని ఉప రాష్ట్రప‌తి ప‌ద‌వి క‌ట్ట‌బెట్టార‌ని విశ్లేషిస్తుంటారు. ఇదంతా టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడుతో ఉన్న శృతిమించిన స‌ఖ్య‌త ఫ‌లిత‌మేన‌ని టాక్.

ఇప్పుడు ఇదే సంద‌ర్భాన్ని తెలంగాణ‌కు చెందిన మాజీ కేంద్ర‌మంత్రి బండారు ద‌త్తాత్రేయ విష‌యంలోనూ ప‌లువురు ప్ర‌స్తావిస్తున్నారు. ద‌త్త‌న్న సైతం తెలంగాణ‌లో పార్టీ బలోపేతానికి కృషి చేయలేద‌నే భావ‌న బీజేపీ నేత‌ల్లో ఉంది. అదే స‌మ‌యంలో ఆయ‌న తెలంగాణ సీఎం కేసీఆర్‌ తో అవ‌స‌రానికి మించిన స‌ఖ్య‌త క‌న‌బ‌ర్చార‌ని బీజేపీ ఢిల్లీ పెద్ద‌లు భావించార‌ట‌. పైగా తెలంగాణ‌లో జ‌రిగిన అవినీతిని సైతం త‌మ దృష్టికి తీసుకురాలేద‌ని అంటున్నారు. అందులో భాగంగానే ఆయ‌న్ను మంత్రి ప‌ద‌వి నుంచి త‌ప్పించార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

అయితే మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన ప‌రిణామాన్ని ఈ సంద‌ర్బంగా ఉద‌హ‌రిస్తున్నారు. ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్రబాబునాయుడు స‌ల‌హాదారు అయిన ప‌ర‌కాల ప్ర‌భాక‌ర్ స‌తీమ‌ణి నిర్మ‌లా సీతారామ‌న్ మాత్రం పార్టీ ప్ర‌యోజ‌నాలే ముఖ్యంగా న‌డుచుకున్నార‌ని అంటున్నారు. అవ‌స‌రానికి మించి టీడ‌పీతో స‌ఖ్య‌త కుదుర్చుకోక‌పోవ‌డం వ‌ల్లే ఆమెకు ప్ర‌మోష‌న్ ద‌క్కింద‌ని విశ్లేషిస్తున్నారు.
Tags:    

Similar News