స్మార్ట్ సిటీల‌ను ప్ర‌క‌టించిన కేంద్రం

Update: 2015-08-27 03:17 GMT
కేంద్ర ప్ర‌భుత్వం దేశంలో ఎంపిక చేసిన స్మార్ట్ సిటీల జాబితాను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ఢిల్లీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో వెంక‌య్య‌నాయుడు మాట్లాడుతూ.. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 98 స్మార్ట్ సిటీలను ప్ర‌క‌టిస్తున్న‌ట్లు తెలిపారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ లో 13, తమిళనాడులో 12, మధ్యప్రదేశ్ 7, గుజరాత్ 6 , కర్ణాటక నుంచి 6 నగరాలు, ఏపీలో మూడు,తెలంగాణ‌లో  గ్రేటర్ హైదరాబాద్, గ్రేట‌ర్ వ‌రంగ‌ల్, బీహార్ లో స్మార్ట్ నగరాలను ఎంపిక చేసినట్టు వెంకయ్య వివరించారు.

రాబోయే ఆరేళ్లలో స్మార్ట్ నగరాల అభివృద్ధి కోసం రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెంక‌య్య‌నాయుడు వెల్లడించారు. ప్రతి స్మార్ట్ సిటీకి ఏడాదికి రూ.100 కోట్లు ఇస్తామన్నారు. కేంద్ర నిధులతో పాటు రాష్ట్ర నిధులతో స్మార్ట్ సిటీల అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు.

తెలుగు రాష్ర్టాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్, తెలంగాణ‌లు 5 స్మార్ట్ సిటీలతోనే స‌రిపెట్టుకురావ‌డం గ‌మ‌నార్హం.
Tags:    

Similar News