వెంకయ్య కొత్త కాన్సెప్ట్.. వైఫై రొమాన్స్

Update: 2016-11-22 09:30 GMT
అమలిన శృంగారం.. కొత్త తరానికి కాస్త అప్ సెట్ గా - అయోమయంగా అనిపించే ఈ కాన్సెప్టు ఇప్పుడు ఏమాత్రం సూటయ్యేది కాకపోయినా ఒకప్పుడు ఉండేది. బుచ్చిబాబులాంటి సాహితీవేత్తలు దీనికి బ్రాండ్ అంబాసిడర్లు. ఇప్పుడు బుచ్చిబాబు లేకపోయినా మన వెంకయ్యనాయుడు ఈ కాన్సెప్టును ఎత్తుకుంటున్నారు. రాజకీయాలతో నిత్యం బిజీగా ఉండే వెంకయ్యనాయుడుకు ఎందుకో కానీ శృంగారంపై కన్నుపడింది.. కాస్త ఆఫ్ బీట్ గా ఆయన రాజకీయాలు మాట్లాడడం ఆపి శృంగారం గురించి మాట్లాడారు. అయితే... నాయుడు గారు ఏం చెప్పినా సమాజం కోసమే కదా.. ఇది కూడా అలాగే. సమాజం చెడిపోకుండా సినిమాలు ఎలా ఉండాలో చెబుతూ ఆయన ఈ అమలిన శృంగారం కాన్సెప్టును మళ్లీ తీసుకొచ్చారు.

ప్రస్తుతం సినిమాల్లో అశ్లీలత బాగా పెరిగిపోయిందని... ఇలాంటివి సమాజంపై ప్రభావాన్ని చూపిస్తాయని వెంకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. హింస - అశ్లీలతలు లేకుండా... భావోద్వేగాలతో మంచి సినిమాలు తీస్తే, సమాజానికి మంచిదని సూచించారు. అనవసరంగా హీరోయిన్లను అసభ్యంగా చూపించవద్దని దర్శక నిర్మాతలను కోరారు.

అంతేకాదు... హీరోయిన్లను తాకకుండానే రొమాన్స్ ను అద్భుతంగా పండిచవచ్చని వెంకయ్య చెప్పారు. అదెలాగో కూడా ఆయన విడమరిచి మరీ వివరించారు. పెదవులు - కళ్లు - ముక్కు - చూపులతో కూడా రొమాన్స్ ను పండించవచ్చని చెప్పారు. పనిలో పనిగా తనకు ఇష్టమైన సినిమాల లిస్టు చదివేశారరు. మున్నాభాయ్ ఎంబీబీఎస్ - లగేరహో మున్నాభాయ్ - నో వన్ కిల్డ్ జెస్సికా - పీకే - ఓ లక్కీ లక్కీ ఓయే సినిమాలు తన అభిమాన సినిమాలని తెలిపారు.  గొప్ప విషయం ఏంటంటే ఈ సినిమాలన్నిట్లోనూ రొమాన్సు ఉంటుంది కానీ... వెంకయ్య చెప్పినట్లు అదంతా అమలిన శృంగారమే.

అయితే.. వెంకయ్య కాన్సెప్టు విన్న ప్రస్తుత టెక్నో జనరేషన్ మాత్రం వెంకయ్య చెబుతున్న దానికి వైఫై రొమాన్సు అని పేరు పెట్టేశారు. డివైస్ కాంటాక్ట్ లేకుండా డాటా ట్రాన్స్ ఫర్ చేసుకున్నట్లుగా శరీరాలు దూరంగా ఉన్నా మనసులు కలిసిపోయే కాన్సెప్టు అని సూత్రీకరిస్తున్నారు. అర్థం చేసుకున్నా ఆదరించడం కష్టమే మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News