60 కంటే 90 ఎక్కువే కదా వెంకయ్య గారూ!

Update: 2016-09-05 04:54 GMT
14వ ఆర్థిక సంఘం కేంద్రానికి చేసిన సిఫారసు ప్రకారం.. లోటు ఉన్నచోట ఆ లోటును పూరించండి, రాష్ట్రాల మధ్య ఎక్కడా వ్యత్యాసం చూపించవద్దు.. అంటే పరోక్షంగా ప్రత్యేక హోదా ఆచరణ సాధ్యం కాదు అని చెప్పడమే అంటున్న వెంకయ్య నాయుడు... "ప్రత్యేక హోదా గురించి అడిగింది నేనే.. అప్పట్లో ఏపీలో ఎలాంటి అభివృద్ధి లేదు.. అందుకే అడిగాను! ఇప్పుడు మాత్రం కేంద్రం ఎన్నో అభివృద్ది పనులను చేస్తోంది" అని చెబుతున్నారు. అంటే.. ప్రస్తుతం కేంద్రం చేస్తున్న అభివృద్ధి పనుల వల్ల ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా, లేకపోయినా పర్లేదు అని చెప్పడమే కదా! తాజాగా ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు.. ప్రత్యేక హోదా విషయంలో మాట్లాడిన మాటలివి.

ఇప్పటికే ఏపీ ప్రజలకు ప్రత్యేక హోదా అనే అంశంపై ఉన్న ఆశ, ఆ హోదా వస్తే రాష్ట్రానికి కలిగే ప్రయోజనాలపై ఫుల్ క్లారిటీ ఉన్న సమయంలో.. హోదా వల్ల వచ్చే ప్రయోజనాలేమిటో.. వాటిని మించిన ప్రయోజనాలు ఏపీకి ఇవ్వాలని సూచించారట. ప్రత్యేక హోదా అంశం ప్రస్థావించిన వెంకయ్యే ఇలా మాట్లాడిన తర్వాత, ఎన్నికల సమయంలో ఈ విషయంపై ఉపన్యాశాలు చెప్పి ప్రజల ఓట్లు సంపాదించిన నేతలు ఇలాంటి మాటలు మాట్లాడటాన్ని ఏమనుకోవాలో ప్రజలకు తెలియంది కాదు.

ఇక కేంద్రం నుంచి రాష్ట్రాలకు గతంలో 50:50 శాతం ప్రకారం నిధులు అందగా.. భాజపా అధికారంలోకి వచ్చాక అది 60:40 శాతానికి పెరిగిందని చెప్పిన వెంకయ్య.. ప్రత్యేకహోదా ఇచ్చిన ఈశాన్య రాష్ట్రాలు - జమ్మూ కశ్మీర్‌ లకు 90:10 శాతం ప్రకారం నిధుల పంపిణీ ఉంటుందని క్లారిటీగా చెప్పారు. పైగా ఇదొక్కటే తేడా తప్ప మిగతాదంతా సేం టు సేం అని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ఇక్కడే ఉంది అసలు సమస్య అంతా.. ప్రత్యేక హోదా వస్తే కేంద్రం నుంచి రాష్ట్రాలకు నిధులు ఏ ప్రాతిపదికన అందుతాయో కూడా చెబుతున్న వెంకయ్య కు 60 కంటే 90 ఎక్కువని తెలియదంటారా? 90:10 ప్రకారం కేంద్రం నుంచి నిధులు పదేళ్లపాటు ఏపీకి వస్తే కలిగే ప్రయోజనాలు తప్పుడు ప్రచారంగా అనిపిస్తున్నాయా? ఏమో.. వెంకయ్యగారికే తెలియాలి!
Tags:    

Similar News