తండ్రి కొడుకుల ఎత్తులు పైఎత్తులతో ముందుకు సాగుతున్న ఉత్తరప్రదేశ్ రాజకీయాలపై కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పందించారు. అదొక కుటుంబ డ్రామా అని వెంకయ్య తేలికగా తీసి పారేశారు. ఎస్పీలోని పరిణామాలు కొన్నిసార్లు డ్రామాగా, మరి కొన్ని సార్లు హాస్యంగా కనిపిస్తోందన్నారు. చివరకు కథ ట్రెజెడీగా ముగుస్తుందని వెంకయ్య నాయుడు వ్యాఖ్యానించారు. ప్రజల సంక్షేమం కోసం ఆలోచించని ఎస్పీ కుటుంబ సంక్షేమ కోసం ఎత్తులు పై ఎత్తులు వేస్తున్నదని వెంకయ్యనాయుడు విమర్శించారు.
ఇదిలాఉండగా పెద్ద నోట్ల రద్దు అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగంపై వెంకయ్య స్పందించారు. ప్రధానమంత్రి పేదలపాలిట పెన్నిది అని - పేదలకు ఇచ్చిన వరాలే ఇందుకు నిదర్శనమని అన్నారు. పేదలకు తక్కువ రేటుకు వడ్డీరేటు అందుతోందని తెలిపారు. పేదల సంక్షేమం, వారి బంగారు భవిష్యత్తు కోసం ప్రధాని బాటలు వేశారని వెంకయ్య నాయుడు కొనియాడారు.
మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సైతం ప్రధానమంత్రి ప్రసంగంపై స్పందించారు. సమాజంలోని వివిధ వర్గాలకు పలు రకాల పథకాలు ప్రకటించినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి అభినందనలు తెలిపారు. 2017లో ఇళ్లు కట్టుకునే గ్రామీణులకు - మధ్య తరగతి వర్గాలకు ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద రుణాలు - రెండు లక్షల వరకు రుణాలపై 3 శాతం వడ్డీ మాఫీ - 9 లక్షల వరకు రుణాలపై 4 శాతం - 12 లక్షల వరకు రుణాలపై 3 శాతం వడ్డీ మాఫీ తదితర వరాలను ప్రధాని ప్రకటించడం గొప్ప విషయమన్నారు. గర్భిణులకు వైద్య చికిత్సలు - పౌష్టికాహారం కోసం ప్రధాని నరేంద్ర మోదీ రూ.6 వేలు ఇస్తామని ప్రకటించడం గర్వించదగిన విషయమన్నారు. అంతేకాకుండా పేద, మధ్య తరగతి ప్రజల అభ్యున్నతికి పలు పథకాలు ప్రకటించినందుకుగాను ఆయన మోదీని అభినందిస్తున్నట్టు చెప్పారు. మోదీ తీసుకున్న నిర్ణయాలు దేశాన్ని ప్రగతి పథంలో తీసుకెళ్తాయని, దేశ ఆర్థికవవస్థను బలోపేతం చేస్తాయని అభిప్రాయపడ్డారు. ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయం వల్ల దేశం మరింత బలోపేతమవుతుందని రాజ్ నాథ్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/