ఆ అధికారులకు వెంకయ్య వణుకు పుట్టించారు

Update: 2016-07-12 04:29 GMT
సమాచార శాఖామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ నేత.. కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తన శాఖాధికారులకు షాకిచ్చారు. సోమవారం ఉదయం 9.30 గంటలకే సమాచార శాఖ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించిన ఆయన తీరుతో సమాచార శాఖ అధికారులు కంగు తిన్నారు. ఉదయం 10 గంటల తర్వాత తాపీగా వచ్చే అలవాటున్న అధికారులు పలువురు వెంకయ్య ఆకస్మిక తనిఖీతో అడ్డంగా బుక్ అయ్యారు.

మంత్రిగారు ఆకస్మిక పర్యటన గురించి తెలుసుకున్న పలువురు ఉద్యోగులు ఉరుకులు పరుగుల మీద ఆఫీసులకు చేరుకున్నారు. అప్పటికే వెంకయ్య సమాచార శాఖలోని కార్యాలయంలోని పలు ఛాంబర్లను స్వయంగా పరిశీలించటమే కాదు.. మరుగుదొడ్ల శుభ్రత ఏ తీరులో ఉన్నాయన్న విషయాన్ని కూడా పరిశీలించి అందరికి వణుకు తెప్పించారు.

ఆఫీసుల్లో బయటకు కనిపిస్తున్న కేబుళ్లను వెంటనే సరి చేయాలన్న సూచన చేయటంతో పాటు.. టైంకు రాని అధికారుల నుంచి వివరణ కోరటం సమాచార శాఖలో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. టైంకి ఆఫీసుకు రావటం.. పరిశుభ్రతకు సంబంధించినఅంశాలపై రోజువారీ సమీక్ష నిర్వహించాలంటూ ఉన్నతాధికారులకు ఆదేశించిన ఆయన తీరు సమాచార శాఖలోని అధికారుల్లో వణుకు తెప్పించింది. తాను బాధ్యతలు స్వీకరించిన శాఖలకు సంబంధించి ఉద్యోగులు సమయానికి వచ్చేలా ఆకస్మిక తనిఖీలు నిర్వహించే విధానాన్ని వెంకయ్య గతంలోనూ అనుసరించారు. తాజాగా చేపట్టిన సమాచారశాఖలోనూ ఫాలో అయ్యారన్న మాట ఆయన సన్నిహితులు చెబుతున్నారు.
Tags:    

Similar News