పూలమాలలకు వెంకయ్య చెల్లుచీటి

Update: 2016-07-18 04:19 GMT
కార్యక్రమం ఏదైనా రాజకీయ నాయకుడ్ని ఆహ్వానిస్తే పూలమాలలు.. చేతికి పూల బొకే అన్నవి కామన్. అలాంటిది కేంద్రమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి ఏదైనా కార్యక్రమానికి హాజరైతే ఆ హడావుడి ఎంతగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఇలాంటి మర్యాదలకు చెక్ పెట్టేలా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు తాజాగా ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు.

ఇకపై తాను పాల్గొనే కార్యక్రమంలో పూలమాలలు తీసుకురావద్దని.. తనకు పూల మాలలు వేయొద్దని కోరారు. ఇకపై ఎవరూ తనకు పూల మాలలు వేయొద్దన్న ఆయన.. ఒకవేళ ఎవరైనా తీసుకొచ్చినా వాటిని తానుతీసుకోనని స్పష్టం చేసేశారు. ఒకవేళ.. అభిమానం ఉంటే ఖాదీ చేనేత కండువా ఇస్తే తీసుకుంటానని చెప్పారు. మరి.. వెంకయ్య మాటను ఎంతమంది అమలు చేస్తారన్నది ఆసక్తికరమైన అంశం. హడావుడి కోసం పూలమాలలు తీసుకొచ్చే కన్నా.. కండువాలాంటిది ఇవ్వటమే మంచిదని చెప్పాలి. అయినా.. వెంకయ్యకు ఉన్నట్లుండి పూల దండలపై అంత విముఖత ఎందుకు వచ్చినట్లు చెప్మా..?
Tags:    

Similar News