సినిన‌టులు ఒక్క‌రే డ్ర‌గ్స్ బాధితులు కాదుఃవెంక‌య్య‌

Update: 2017-07-30 06:08 GMT
భాగ్యనగరానికి ఘనమైన చరిత్ర ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కేంద్ర మాజీ మంత్రి ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థి వెంకయ్యనాయుడు తెలిపారు. డ్రగ్స్ మహమారిని తరిమికొట్టి దేశాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని సూచించారు. డ్ర‌గ్స్ మాఫియాపై ద‌ర్యాప్తులో భాగంగా ఎక్సైజ్ శాఖ సార‌థ్యంలోని సిట్ విచార‌ణ బృందం ర‌థ‌సార‌థి అకూన్ సబర్వాల్ గొప్పగా పనిచేస్తున్నార‌ని వెంక‌య్య‌నాయుడు ప్ర‌శంసించారు. స్వర్ణభారతి ట్రస్ట్- హర్ష టొయోట ఆధ్వర్యంలో కేబీఆర్ పార్క్ వద్ద నిర్వహించిన యాంటీ డ్రగ్ కాంపెయిన్ రన్‌లో పాల్గొన్న వెంకయ్యనాయుడు ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ యువతను పెడ దారిన పడకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు.

మాదక ద్రవ్యాల సమస్య ఏ ఒక్క ప్రాంతానికో వార్గానికో చెందిన‌ది కాదని వెంక‌య్య‌నాయుడు స్ప‌ష్టం చేశారు. వీటి వల్ల దేశం నిర్వీర్యం అయ్యే ప్రమాదం ఉందని అందుకే డ్రగ్స్ ని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. సినిమా వాళ్ళే డ్రగ్స్ తీసుకుంటున్నారనేది కరెక్ట్ కాదని, అనేక వర్గాల వారు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు అని తెలిపారు. చిన్న పిల్లలను కూడా డ్రగ్స్ కు బానిస అయ్యేలా చేస్తున్నారని విని తీవ్ర కలత చెందానని ఆయ‌న పేర్కొన్నారు. రాష్ట్ర పోలీసులకు డ్రగ్ మాఫియాను ఆటకట్టించే దమ్ము ధైర్యం తెలంగాణ రాష్ట్ర పోలీసులకు ఉంద‌ని తెలిపారు. రాష్ట్ర పోలీస్ విభాగం పనితీరు అద్భుతంగా ఉందని వెంక‌య్య‌నాయుడు ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు.

డ్రగ్స్ తీసుకునే వారిని అంటరాని వారిగా చూడొద్దని, వారిని మ‌త్తుమందు బారి నుండి రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని వెంక‌య్య‌నాయుడు సూచించారు. మ‌న‌ దేశ సంస్కృతిని సార్వభౌమత్వాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయ‌న‌ తెలిపారు. సమాజాన్ని  ప్రబావితం చేయగల శక్తి సినిమా రంగానికి ఉందని పేర్కొన్నారు. మీడియా ఒక బ‌ల‌మైన ప్ర‌సార సాధ‌నమ‌ని పేర్కొంటూ డ్ర‌గ్స్ స‌హా ఇత‌ర మ‌త్తుప‌దార్థాల వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియచేయాలని కోరారు. సాహితీ సాంస్కృతిక రంగాల వారు యాంటీ డ్రగ్ క్యాంపెయిన్‌ ను నిర్వహించాలని వెంక‌య్య‌నాయుడు సూచించారు.
Tags:    

Similar News