దేశవ్యాప్తంగా ప్రకంపలను సృష్టిస్తొన్న హైదరాబాదీ వెటర్నరి డాక్టర్ దిశ దారుణమైన హత్య పై ఈ రోజు పార్లమెంట్ ని షేక్ చేస్తుంది. ఈ ఘటన పై పార్లమెంట్ ఉభయ సభల్లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. ప్రతిపక్షానికి చెందిన కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు లోక్ సభ - రాజ్యసభల్లో ఈ అంశం పై మాట్లాడారు. లోక్ సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి - రేవంత్ రెడ్డి - రాజ్యసభలో జయా బచ్చన్ తదితరులు ఈ అంశంపై మాట్లాడారు.
దేశవ్యాప్తంగా మహిళలు - చిన్న పిల్లలు కొనసాగుతున్న అత్యాచారాలు - హత్యల పరంపరపై ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన వాయిదా తీర్మానంపై రాజ్యసభలో చర్చ కొనసాగుతోంది. ఈ ఉదయం ప్రతిపక్ష సభ్యులు వాయిదా తీర్మానాన్ని అందజేశారు. రాజ్యసభ ఛైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ఈ తీర్మానాన్ని స్వీకరించారు. చర్చకు అనుమతి ఇచ్చారు. దీనితో ఈ ఘటన పై విస్తృతంగా చర్చ కొనసాగుతోంది. వాయిదా తీర్మానాన్ని అనుమతించిన తరువాత వెంకయ్య నాయుడు ఈ అంశంపై మాట్లాడారు. ఇప్పుడున్న చట్టాల్లో మార్పులను తీసుకుని రావడం వల్ల ఉపయోగం లేదని తేల్చి చెప్పారు.
ప్రజల మైండ్ సెట్ మారాలి అని - అప్పుడే మహిళలు - చిన్నపిల్లలపై అత్యాచారాలు తగ్గుముఖం పడతాయని అన్నారు. అత్యాచారాలను అడ్డుకోవడానికి అవసరమైన కఠిన నిర్ణయాలను తీసుకునేలా రాష్ట్ర ప్రభుత్వాలు - రాజకీయ నాయకులు సైతం వ్యవహరించాల్సి ఉందని చెప్పారు. అత్యాచారాలు జరిగే అవకాశం ఉందని సమాచారం అందిన వెంటనే శరవేగంగా స్పందంచదగ్గ నైపుణ్యం అధికార యంత్రాంగానికి ఉండాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆ స్థాయిలో అధికారాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత పాలకులపై ఉందని గుర్తు చేశారు.