తనదైన శైలిలో వాదనలు వినిపించి.. రాజకీయ ప్రత్యర్థులుపై విరుచుకుపడటం తెలంగాణ అధికారపక్ష ఎంపీ.. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవితకు అలవాటే. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు విషయంలో గళం విప్పిన తెలంగాణ ఎంపీలతో పాటు.. లోక్ సభలో బుధవారం కవిత మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పేరు ప్రస్తావించారు.
ఉమ్మడి హైకోర్టు అడ్డు పెట్టుకొని చంద్రబాబు తెలంగానను పాలించాలని భావిస్తున్నట్లుగా ఆమె వ్యాఖ్యలు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలపై టీడీపీ ఎంపీలు నిరసన వ్యక్తం చేశారు. ఈ దశలో జోక్యం చేసుకున్న కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. సభలో లేని వ్యక్తుల పేర్లు ప్రస్తావించొద్దన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలను సమానంగా చూస్తున్నామని.. విషయం హైకోర్టు పరిధిలో ఉందన్నారు.
ఎంపీ కవిత మాటలు చిన్నపిల్లల మాటల్లా ఉన్నాయని వ్యాఖ్యానించారు. అవకాశం దొరికితే విమర్శలు చేసే కవితకు.. వెంకయ్య తన వ్యాఖ్యలతో కాస్తంత చురుకు అంటించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. వెంకయ్య వ్యాఖ్యలు చూసినప్పుడు తెలుగుతమ్ముళ్ల కంటే.. వెంకయ్యే కవితకు పంచ్ ఇచ్చినట్లుగా కనిపిస్తోంది.