హిందూమ‌తం కాదు...జీవ‌న‌శైలి:వెంక‌య్య‌

Update: 2018-01-11 08:16 GMT
కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ద‌ర్శించుకున్నారు. బుధ‌వారం సాయంత్రం 5.30 గంటలకు ఆయన కుటుంబ సభ్యులతో కలిసి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ - జేఈవో శ్రీనివాస రాజు - అధికారులు ఘనంగా స్వాగతం పలికి పద్మావతి అతిధిగృహంలో బస ఏర్పాట్లు చేసి - దర్శన ఏర్పాట్లు చేశారు.

ఉప రాష్ట్రపతి తన కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఉదయం 6:20 గంటలకు శ్రీవరాహ స్వామి వారిని దర్శనం చేసుకుని అనంతరం శ్రీవారి దర్శనం చేసుకొనున్నారు. దర్శనానంతరం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ మకర సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, భారతదేశం శక్తివంతమైన దేశంగా ఎదగాలని శ్రీవేంకటేశ్వరస్వామిని కోరుకున్నానని తెలిపారు. హిందూమతాన్ని మతంగా చూడకూడదని - దానిని ఒక జీవన శైలిగా చూడాలని వెంకయ్య‌యనాయుడు చెప్పారు. తిరుమలకు వీఐపీలు అవసరాన్ని బట్ట వస్తే సామాన్య భక్తులకు అవకాశం లభిస్తుందని ఈ సంద‌ర్భంగా వ్యాఖ్యానించారు.

కాగా ద‌ర్శ‌నం అనంత‌రం తిరిగి 7:30 గంటలకు శ్రీవారి ఆలయం నుండి బయలుదేరి పద్మావతి గెస్ట్ హౌస్ చేరుకుని ఉదయం 9 గంటలకు రేణిగుంట ఎయిర్ పోర్ట్ కు చేరి నెల్లూరు బయలుదేరి వెళ్లారు. తిరుమ‌ల శ్రీవారి ద‌ర్శ‌నం అనంత‌రం ఉప రాష్ర్ట‌ప‌తి వెంక‌య్య నెల్లూరుకు చేరుకున్నారు. పోలీస్ ప‌రేడ్ గ్రౌండ్స్ లో మంత్రులు నారాయ‌ణ‌ - సోమిరెడ్డి ఉప‌రాష్ట్రప‌తి వెంక‌య్య‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంతం పోలీసుల గౌర‌వ వంద‌నం స్వీక‌రించారు. ఈనెల 11వ తేదీ నుంచి 16 తేదీ వరకు నెల్లూరు జిల్లాలో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటించనున్నారు. సంక్రాంతి పండుగను బంధువులతో జరుపుకోనున్నారు.


Tags:    

Similar News