వీడియో వైరల్: డ్రైనేజీ గుంతలో పడిన మహిళ, శిశువు

Update: 2020-03-20 05:48 GMT
హైదరాబాద్ లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.. రెండు రోజులుగా మబ్బుమబ్బుగా ఉంటున్నా గురువారం ఒక్కసారిగా ఆకాశమంతా మేఘావృతమై గురువారం సాయంత్రం హైదరాబాద్ లో ని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. పలు చోట్ల వడగళ్ల వాన కూడా పడింది. దీంతో వాహనదారుల తో పాటు ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అకాల వర్షానికి ప్రజలు బెంబేలెత్తారు. ఎందుకంటే ముందే కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న వేళ ఈ వర్షం రాక తో భయాందోళన వ్యక్తం చేశారు. ఎందుకంటే కరోనా వైరస్ చల్లటి వాతావరణం ఉంటే వేగంగా విస్తరిస్తుందని అనే విషయం తెలిసి కంగారు పడ్డారు. అయితే హైదరాబాద్ వాసులకు వర్షం పడితే కష్టాలు ఎదుర్కోవడం సర్వసాధారణం. దీంతో ఆ వర్షానికి రోడ్లపై వరద చేరిపోయింది. డ్రైనేజీలన్నీ పొంగి ప్రవహించాయి. దీంతో ఎక్కడ గుంత ఉందో.. ఎక్కడ మెట్ట ఉందో అర్థం కాని పరిస్థితి. ఒకరికొకరు సహకరించుకుంటూ గమ్యస్థానాలకు చేరారు. అయితే ఒకచోట ఒక మహిళ శిశువుతో పాటు డ్రైనేజీ గుంతలో పడడం కలకలం రేపింది. దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.

అయితే హైదరాబాద్ లో తరచు రోడ్లు తవ్వడం.. డ్రైనేజీ పనులు చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో గురువారం పడిన వర్షం కారణంగా ఒక చోట జీహెచ్ఎంసీ సిబ్బంది తవ్విన గుంత నీటితో నిండిపోయింది. ఆ సమయంలో కారు దిగి ఓ మహిళ కొన్ని రోజుల శిశువును ఎత్తుకొని ఓ మెడికల్ షాపు పక్క నుంచి నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. అక్కడే ఉన్న జీహెచ్ఎంసీ తవ్విన గుంత నీటితో నిండిపోయిందనే విషయం తెలియక అలాగే దానిపై నుంచి నడుచుకుంటూ వెళ్తోంది. ఆ గుంతపై కాలు వేయగానే శిశువుతో పాటు ఆమె గుంతలోకి పడిపోయింది. ఆమె షాక్ కు గురై హాహాకారాలు చేసింది. వెంటనే గమనించిన స్థానికులు మొదట శిశువును కాపాడి.. అనంతరం ఆ మహిళను కాపాడారు. దీంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

డ్రైనేజీ గుంతకు శిశువు తో పాటు మహిళ ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉందని ఆందోళన చెందారు. అయితే ఇలాంటి గుంతలు తవ్వి విడిచిపెట్టడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్ఎంసీ పనులు ఇలానే ఉంటాయని... ఏ పనులు పూర్తి చేయకుండా మమ అనిపిస్తారని విమర్శలు చేస్తున్నారు. ఆ గుంత లో పడి శిశువుతోపాటు ఆ మహిళ చనిపోయింటా ఎవరిది బాధ్యత అని ప్రశ్నిస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన వీడియో ఓ వ్యక్తి ట్విటర్ లో పోస్టు చేయడం తో వైరలైంది. ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Full ViewFull View
Tags:    

Similar News