కరోనా, లాక్ డౌన్ కారణంగా విద్యాసంస్థలు మూసేసారు. మళ్లీ ఎప్పుడు ఓపెన్ చేస్తారో కూడా తెలియని పరిస్థితి. దీనితో చాలా విద్యాసంస్థలు ఈ ఏడాది తమ విద్యార్థులు నష్ట పోకుండా ఆన్ లైన్ లో క్లాసులు చెప్తున్నారు. దీనికోసం వాట్సాప్ గ్రూపులు క్రియేట్ చేసుకుని డౌట్లు పంచుకుంటూ స్టూడెంట్స్ డౌట్స్ ను క్లియర్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్కడక్కడా కొన్ని దిగ్భ్రాంతికర ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. కొన్నిరోజుల కర్నూలులో స్కూల్ వాట్సాప్ గ్రూపులో పోర్న్ వీడియోలు పోస్ట్ కావడం తీవ్ర కలకలం రేపింది. ఇదే తరహాలో ఉత్తర్ ప్రదేశ్ లోని భాగ్ పత్ పట్టణంలో ఓ ప్రైవేట్ స్కూల్‌కి చెందిన పదో తరగతి విద్యార్థుల వాట్సాప్ గ్రూపులో నగ్న వీడియోలు ప్రత్యక్షం అయ్యాయి.
భాగ్ పత్ లోని ఓ ప్రైవేట్ స్కూల్లో టెన్త్ క్లాస్ చదువుతున్న ఓ విద్యార్థి ఇంటర్నేషనల్ ఫోన్ నంబర్ తో బయోలజీ వాట్సాప్ గ్రూపు క్రియేట్ చేశాడు. ఆదివారం వాటిలో అశ్లీల వీడియోలతో పాటు బయోలజీ టీచర్ ఫోటోలు పోస్ట్ చేశాడు. ఈ వీడియో కింద కొందరు విద్యార్థులు అసభ్యంగా ఛాటింగ్ చేశారు. దీనిపై ఓ విద్యార్థి స్కూల్ ప్రిన్సిపాల్ కు సమాచారం అందించాడు. ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీనితో ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న సైబర్ క్రైం పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు