ఈసారి కేటీఆర్ నోట 'భ‌వ‌న్' మాట‌

Update: 2017-05-06 06:07 GMT
హామీలు ఇవ్వ‌టంలో తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు త‌ర్వాతే ఎవ‌రైనా. ఎడాపెడా నిర్ణ‌యాలు తీసుకునే ముఖ్య‌మంత్రిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు మంచి పేరే ఉంది. ఆయ‌న ఎవ‌రితోనైనా భేటీ అయినా.. స‌మావేశ‌మైనా.. ఆయ‌న నోట అల‌వోక‌గా ఒక హామీ ఇచ్చేస్తుంది. దాని అమ‌లు ఎప్పుడ‌న్న‌ది ప‌క్క‌న పెడితే.. అదిరిపోయే హామీ అయితే మాత్రం వ‌స్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఇప్పుడ‌దే ఆన‌వాయితీని కొన‌సాగించారు కేసీఆర్ కుమారుడు.. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌.
 
తాజాగా తెలంగాణ సచివాల‌యంలో ప్ర‌వాస విధానంపై ఒక స‌మీక్ష‌ను నిర్వ‌హించారు. దీనికి ప‌లువురు ప్ర‌భుత్వ అధికారుల‌తో స‌మీక్ష‌ను నిర్వ‌హించారు. ప్ర‌వాస భార‌తీయ దివ‌స్ 2019ను హైద‌రాబాద్ లో నిర్వ‌హించాల‌ని కేంద్రాన్ని తాము కోర‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు. విదేశీ వ్య‌వ‌హారాల కార్యాల‌యం.. పాస్ పోర్ట్ సేవ‌లు.. పౌరుల భ‌ద్ర‌త‌.. ప్ర‌వాసీయుల వివ‌రాలు అన్ని ఒకేచోట ల‌భించేలా ఒక విదేశీ భ‌వ‌న్ ను హైద‌రాబాద్ లో నిర్మించ‌నున్న‌ట్లుగా వెల్ల‌డించారు.

ఈ భ‌వ‌న్ కు అవ‌స‌ర‌మైన భూమిని కేటాయిస్తామ‌ని హామీ ఇవ్వ‌టం గ‌మ‌నార్హం. ఈ త‌ర‌హా భ‌వ‌న్ ల మాటను త‌ర‌చూ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇస్తుంటారు. ఆయ‌న‌కు కొన‌సాగింపు అన్న‌ట్లుగా కేటీఆర్ ఇచ్చిన తాజా హామీ ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.  గ‌ల్ఫ్‌.. మ‌లేసియాలో భార‌తీయుల స‌మ‌స్య‌లు.. నియ‌మ‌క ఏజెన్సీల అక్ర‌మాలు.. మ‌హిళ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌లు.. క‌నీస వేత‌నాల‌పై కేంద్ర విదేశాంగ శాఖా మంత్రి సుష్మ స్వ‌రాజ్ తో భేటీ కానున్న‌ట్లుగా కేటీఆర్ వెల్ల‌డించారు. మొత్తంగా విదేశీ భ‌వ‌న్ పేరిట భారీ భ‌వ‌నాన్ని హైద‌రాబాద్ లో త్వ‌ర‌లో నిర్మించ‌నున్నార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. కేసీఆర్ ఇచ్చిన భ‌వ‌న్ లు ఇప్ప‌టికి ఏ ఒక్క‌టి ఒక కొలిక్కి రాని నేప‌థ్యంలో.. మంత్రి కేటీఆర్ వెల్ల‌డించిన భ‌వ‌న్ అయినా ఒక కొలిక్కి వ‌స్తుందేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News