అప్రమత్తత అవసరమే కానీ ఆందోళన అక్కర్లేదట

Update: 2021-12-01 06:30 GMT
ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసిన కరోనా మహమ్మారికి సంబంధించి మరో కొత్త ఎపిసోడ్ ‘ఒమిక్రాన్’ పేరుతో ఎంట్రీ ఇవ్వటం తెలిసిందే. ఇప్పటికే డెల్టా దెబ్బకు దిమ్మ తిరిగిపోయిన జనాలకు.. ఈ ఒమిక్రాన్ మరెంత చేటు చేస్తుందన్న భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. విపత్తును చూస్తే.. ఎప్పుడు చెప్పి..

అందరూ అప్రమత్తం అయ్యాక రాదని.. మనిషి అర్థం చేసుకొని రియాక్టు అయ్యే లోపే విరుచుకుపడే అలవాటు ఉన్న నేపథ్యంలో.. ఒమిక్రాన్ విషయంలో ఆందోళన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది. అంతే కాదు.. ఒమిక్రాన్ పుణ్యమా అని కొవిడ్ 19 తగ్గుముఖం పట్టే అవకాశం ఉందన్న కొత్త మాట వినిపిస్తోంది. ఒమిక్రాన్ చేసే మేలేమంటే.. ఇప్పటివరకు మహమ్మారిగా ఉన్న కొవిడ్.. దీి పుణ్యమా అని.. సాధారణ ఇన్ ఫెక్షన్ మాదిరి మారే అవకాశం ఉందని చెబుతున్నారు.

కాకుంటే ఎప్పటికి ఉండిపోవటం ఖాయమంటున్నారు. సాధారణ జలుబు.. వైరల్ ఫీవర్ లాంటివి ఎలా వచ్చి పోతుంటాయో.. అదే రీతిలో కరోనా కూడా ఒక వైరల్ ఇన్ ఫెక్షన్ మాదిరి ఉండటం ఖాయమంటున్నారు. ఒమిక్రాన్ తో తీవ్రస్థాయి వ్యాధికి పెద్దగా అస్కారం లేదని ఆఫ్రికా నుంచి వస్తున్న సమాచారం స్పష్టం చేస్తోంది. అయితే.. ఇలా వచ్చే సమాచారం పరిమితంగా ఉన్న కారణంగా.. ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.

మహమ్మారి ఏదైనా విరుచుకుపడిన మొదట్లో చోటు చేసుకునే ఉత్పాతానికి.. ఆ తర్వాత జరిగే దానికి పోలిక ఉండదని చెబుతున్నారు. దీనికి ఒక ఉదాహరణను ప్రస్తావిస్తున్నారు. కొంత కాలం క్రితం మిక్సోమెటోసిస్ అనే వ్యాధి ఆస్ట్రేలియాలో తొలిసారి ప్రబలినప్పుడు అక్కడి కుండేళ్లలో 99 శాతం మరణించాయి. ఆ తర్వాత ఈ వ్యాధి బలహీనపడింది. దీంతో.. కుందేళ్లు చనిపోయే వాటి సంఖ్య త్గగిపోయింది. సరిగ్గా కరోనా సైతం ఇలాంటి పరిస్థితే ఉంటుందని చెబుతున్నారు.

ఇంతకాలం పాండమిక్ గా ఉన్నది కాస్తా ఇప్పుడు ఎండెమిక్ (సాధారణ ఇన్ ఫెక్షన్) గా మారుతుందని చెబుతున్నారు. ఒమిక్రాన్ పుట్టుక ఈ ప్రక్రియలో పడిన మొదటి అడుగ్గా నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు వచ్చిన వేరియంట్లను చూస్తే.. ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. వ్యాధి లక్షణాలు తీవ్రంగా ఉంటే త్వరగా గుర్తించటమే కాదు..

నివారించేందుకు వీలుంటుంది. అదే సమయంలో లక్షణాలు తక్కువగా కనిపిస్తూ ఉన్న వేరియంట్లు తీవ్రతను చూపించటమే కాదు.. వ్యాపి కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్న వేళ.. నిర్దారణ పరీక్షలకు ముందుకు రారు. అదే తీవ్రత ఎక్కువగా ఉంటే.. వెంటనే పరీక్షలు చేయించుకుంటాం.ఈ రీతిలో తీవ్రత ఎక్కువగా ఉన్న వేరియంట్లు వేగంగా వ్యాప్తి చెందినా.. వాటిని కంట్రోల్ చేయటం త్వరగానే చేయొచ్చన్న మాట వినిపిస్తోంది.


Tags:    

Similar News