మాల్యా మళ్లీ ఇండియాకు రాడు

Update: 2016-11-05 10:14 GMT
బడా పారిశ్రామికవేత్తగా... సెలబ్రిటీగా... ఐపీఎల్ జట్టు ఓనర్ గా.. ఎంపీగా.. ఒకటేమిటి ఈ దేశంలో సర్వసుఖాలు - స్టార్ డమ్ అనుభవించిన లిక్కర్ కింగ్ మాల్యా బ్యాంకులకు కోట్ల రూపాయలకు టోపీ పెట్టి చక్కగా లండన్ చెక్కేశాడు. ఇప్పుడు ఆయన్ను స్వదేశానికి రప్పించేందుకు బ్యాంకులు విఫల ప్రయత్నాలు చేస్తున్నాయి. కోర్టుల ద్వారా నోటీసులు పంపిస్తున్నాయి. అయితే... మాల్యా మాత్రం విదేశాల్లో బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఇండియాకు రాకుండా తప్పించుకుంటున్నాడు. అయినా... ఆయన్ను రప్పించడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా పడిన కేసుపై వాదనల సమయంలో తాజాగా పాటియాలా కోర్టు న్యాయమూర్తి మాల్యా కథేంటో రెండు ముక్కల్లో చెప్పేశారు. మాల్యాకు చట్టాలపై ఏమాత్రం గౌరవం లేదని... ఆయన మళ్లీ ఇండియాకు రాడని చెప్పేశారు.

మాల్యాకు ఢిల్లీ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంటు జారీ చేసింది. ఫెరా ఉల్లంఘన కేసులో సమన్ల నుంచి తప్పించుకున్నందుకు గానూ శుక్రవారం వారెంటు జారీ చేసింది. కేసు విచారణను క్షుణ్ణంగా పరిశీలించిన మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ సుమిత్‌ ఆనంద్‌ మాల్యాపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాల్యాకు భారత్‌ కు రావాలన్న ఉద్దేశం లేదు, అసలు అతనికి స్వదేశీ చట్టాలపైన గౌరవం లేదు అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు భారత్‌ రావాలని ఉన్నా పాస్‌పోర్టు లేని కారణంగా రాలేక పోతున్నానని మాల్యా కుంటి సాకులు చెబుతు న్నారని అన్నారు. కేసును వచ్చే నెల 22కు వాయిదా వేశారు.

కాగా 2012 నాటి చెక్‌ బౌన్స్‌ కేసు లో మాల్యాకు మరో నాన్‌బెయిల బుల్‌ వారెంట్‌ జారీ చేశారు. లండన్‌లో తలదాచుకుంటున్న మాల్యాకు విదేశీ మంత్రిత్వ శాఖ ద్వారా వారెం టు నోటీసులు పంపాలని పోలీసులను ఆదేశిం చారు. ఫిబ్రవరి 4కు విచారణ వాయిదా వేశారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News