వారిని క‌ల‌వొద్దు...మాల్యాకు స‌ర్కార్ షాక్!

Update: 2018-08-04 13:27 GMT
భార‌త్ లో బ్యాంకుల‌కు వేల కోట్ల రూపాయ‌లు ఎగ్గొట్టిన లిక్క‌ర్ కింగ్ విజ‌య్ మాల్యా....ఎంచ‌క్కా లండ‌న్ లో ఎంజాయ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. లండన్‌ లో పరుగు పందేలు - వింబుల్డన్‌ - క్రికెట్‌ మ్యాచ్ లు చూస్తూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే, 'పారిపోయిన ఆర్థిక నేరగాళ్ల ఆర్డినెన్స్' కింద మాల్యాను పారిపోయిన నేరస్థుడిగా ప్రకటించాలని ఈడీ డిమాండ్ చేయ‌డంతో మాల్యా దిగివ‌చ్చాడు. మాల్యాకు చెందిన దాదాపు రూ.13 వేల‌ కోట్ల ఆస్తులు జప్తు చేయాలని ముంబై కోర్టులో పిటిష‌న్ దాఖల‌వ‌డంతో మాల్యా దెబ్బ‌కు దిగివ‌చ్చాడు. తాను త్వ‌ర‌లోనే భార‌త్ కు వ‌స్తాన‌ని - బ‌కాయి ప‌డ్డ 13 వేల కోట్ల‌ను చెల్లిస్తాన‌ని ప్ర‌క‌టించాడు. ఈ నేప‌థ్యంలో లండ‌న్ లో ఉన్న మాల్యాకు తాజాగా మోదీ స‌ర్కార్ షాకిచ్చింది. ఇంగ్లండ్ లో ప‌ర్య‌టిస్తోన్న టీమిండియాను కల‌వాల‌న్న మాల్యా ఆశ‌ల‌పై కేంద్రం నీళ్లు చ‌ల్లింది.

విజ‌య్ మాల్యాకు ప‌లువురు భార‌త క్రికెట‌ర్ల‌తో సంబంధాలున్న సంగ‌తి తెలిసిందే. ఐపీఎల్ లో రాయ‌ల్ చాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు జ‌ట్టు య‌జ‌మాని అయిన మాల్యాకు...ఆ జట్టు కెప్టెన్ కోహ్లీతో స‌న్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప్ర‌స్తుతం భారత క్రికెట్‌ జట్టు ఇంగ్లండ్ లో పర్యటిస్తోన్న టీమిండియాను మాల్యా క‌ల‌వాల‌నుకున్నాడ‌ట‌. జ‌ట్టును కలిసేందుకు అనుమతి కావాలని కేంద్రం అనుమ‌తి కోరాడ‌ట‌. అయితే, ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఆట‌గాళ్ల‌ను క‌ల‌వ‌డం వీలు కాదంటూ భారత ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయ‌డంతో మాల్యాకు షాక్ త‌గిలింది. భారత క్రికెటర్లను కలిసేందుకు వీల్లేదని, వారిని కలిసేందుకు ప్రయత్నాలు చేయవద్దని మాల్యాను భార‌త స‌ర్కార్ ఆదేశించింద‌ట‌. త‌న ఆశ‌ల‌పై మోదీ స‌ర్కార్ నీళ్లు చ‌ల్ల‌డంతో మాల్యా తీవ్ర నిరుత్సాహానికి గురయ్యాడట‌.


Tags:    

Similar News