దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఎట్టకేలకు ముగియగా... అంతా ఊహించినట్లుగానే అక్కడ బీజేపీ మరోమారు అధికార పగ్గాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. వరుసగా ఆరో సారి అక్కడ విజయం సాధించిన బీజేపీ... మొన్నటి ఎన్నికల్లో చుక్కలు కనిపించాయని చెప్పక తప్పదు. ఎందుకంటే... అప్పటిదాకా గుజరాత్ సీఎంగా ఉన్న నరేంద్ర మోదీ... 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలోకి దిగడం, ఎన్నికల్లో బంపర్ మెజారిటీ దక్కించుకుని మోదీ పీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ క్రమంలో గుజరాత్ సీఎం పదవికి మోదీ రాజీనామా చేయక తప్పలేదు. అయితే తాను ఖాళీ చేసిన గుజరాత్ సీఎం పీఠంపై తనకు అత్యంత నమ్మకస్తురాలిగా ఉన్న ఆనందీబెన్ పటేల్ ను కూర్చోబెట్టిన మోదీ... పటేళ్ల ఆందోళనల నేపథ్యంలో ఆమెను దించేసి సౌమ్ముడిగా పేరున్న పార్టీ సీనియర్ నేత విజయ్ రూపానీకి బాధ్యతలు అప్పగించారు. అయితే విజయ్ రూపానీ సీఎంగా పెద్దగా ఆకట్టుకున్న దాఖలా ఏమీ కనిపించలేదు.
అదే సమయంలో కొత్తగా కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేతబట్టిన రాహుల్ గాందీ... గుజరాత్ ఎన్నికల్లో సర్వ శక్తులూ ఒడ్డారు. రాహుల్ ప్రచారానికి ధీటుగా మోదీ కూడా గుజరాత్ ను చుట్టేసినా... గతంలో మోదీ సీఎంగా ఉన్న సమయంలో బీజేపీకి కనిపించినంతగా అనుకూలత వ్యక్తం కాలేదు. సీఎంగా రూపానీ పెద్దగా ఆకట్టుకునే పాలన సాగించకపోవడమే ఇందుకు కారణమన్న వాదన కూడా వినిపించింది. ఈ క్రమంలో 99 స్థానాలతో క్లిస్టర్ క్లియర్ మెజారిటీ సాధించిన బీజేపీ... వరుసగా ఆరో పర్యాయం గుజరాత్ లో అధికారం చేజిక్కించుకున్నా... సీఎంగా ఎవరిని నియమిస్తారనే ఊహాగానాలు రేకెత్తాయి. రూపానీకి ఈ దఫా మొండి చెయ్యి చూపడం ఖాయమన్న వాదన వినిపించగా... బీజేపీ అధిష్ఠానానికి రూపానీ కంటే మెరుగైన అభ్యర్థి అక్కడ కనిపించలేదు. సుదీర్ఘంగా మంతనాలు సాగించిన అధిష్ఠానం చివరకు రూపానీ వైపే మొగ్గు చూపక తప్పలేదు. ఈ నేపథ్యంలో మొన్ననే పార్టీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన రూపానీ... కాసేపటి క్రితం గుజరాత్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
మోదీతో పెద్దగా సామీప్యత లేకున్నా... పార్టీలో సీనియర్ గా - క్లీన్ ఇమేజీ ఉన్న నేతగా రూపానీకి రెండో పర్యాయం అవకాశం దక్కిందని చెప్పాలి. అంతకంటే కూడా రూపానీ కంటే కూడా మెరుగైన అభ్యర్థి బీజేపీ అధిష్ఠానానికి కనిపించని కారణంగానే రూపానీకి పదవి దక్కిందన్న వాదన వినిపిస్తోంది. ఇక సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టిన రూపానీ... తన కేబినెట్ మంత్రులనూ ఎన్నుకున్నారు. మొన్నటిదాకా డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేప్టటిన నితిన్ పటేల్ ఈ దఫా కూడా రూపానీ కేబినెట్ లో డిప్యూటీ సీఎం హోదా దక్కించుకున్నారు. నితిన్ తో పాటు మొత్తం 19 మంది కేబినెట్ మంత్రులను ఎంపిక చేసుకున్న రూపానీ... వారందరినీ తన కేబినెట్ లో చేర్చేసుకున్నారు. సో... మొత్తానికి ఎన్నికలు బీజేపీకి అనుకూలంగానే కనిపించగా - మునుపటి కేబినెట్ స్థానంలో మరోమారు పాత సీఎం - పాత డిప్యూటీ సీఎంలతోనే బీజేపీ పాలనా పగ్గాలను చేపట్టిందన్న మాట.