వైసీపీలో ఇటీవల చోటుచేసుకున్న కీలక రాజకీయ పరిణామాలు అక్కడ ప్రచ్ఛన్న యుద్ధాలకు తెరతీశాయి. మాజీ కేంద్ర మంత్రి - కాపు ప్రముఖుడు దాసరి నారాయణ రావును జగన్ తన పార్టీలోకి ఆహ్వానించడం తెలిసిందే. ఆయన ప్రస్తుతం ఇంకా వైసీపీలో చేరనప్పటికీ మార్చిలో ఏపీలో రాజ్యసభ సీట్లు ఖాళీ అయ్యే సమయానికి వైసీపీలోకి వస్తారని... వైసీపీ కోటాలో రాజ్యసభకు వెళ్తారని అంచనాలు మొదలయ్యాయి. దీంతో దాసరి రాకను వైసీపీ నేత విజయసాయిరెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారట. సీనియర్ నేత మైసూరారెడ్డిని పక్కకు నెట్టి మరీ విజయసాయిరెడ్డి వైసీపీలో రాజ్యసభ సీటుకోసం కాచుక్కూచున్నారు. తమ పార్టీకి వచ్చే ఆ ఒక్క స్థానం తనకేనని ఇంతకాలం ఆయన నమ్మకంగా ఉన్నారు. కానీ, సడెన్ గా ఈక్వేషన్స్ మారిపోవడంతో ఆయన ఆందోళన చెందుతున్నారు. మైసూరాను దెబ్బతీసి తాను వస్తే... తనను పక్కకు తోసేసి దాసరి మూడో కృష్ణుడులా వచ్చేస్తున్నారని ఆయన ఫీలవుతున్నారట. దీనిపై అధినేత జగన్ వద్ద కూడా ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారట.
దాసరిని వైసీపీ నుంచి రాజ్యసభకు పంపి కాపులను ఆకట్టుకోవాలన్నది జగన్ ఆలోచన. మళ్లీ రెడ్లకే ఇస్తే కాపుల్లో నమ్మకం కలగకపోవచ్చన్నది జగన్ భయం... అందుకే తనకు అత్యంత నమ్మకస్తుడైన విజయసాయి రెడ్డిని బలిచేసి దాసరికి అవకాశమివ్వడానికి ఆయన రెడీ అవుతున్నారట. దీంతో విజయసాయి కక్కలేక మింగలేక ఉన్నారట.