విజయ సాయిరెడ్డి స‌వాల్ చంద్రబాబు స్వీక‌రిస్తాడా...!

Update: 2019-10-23 10:24 GMT
ఏపీలో ఇప్పుడు రాజకీయం ర‌స‌వత్త‌రంగా సాగ‌బోతుందా.?  టీడీపీ - వైసీపీ పార్టీల నేత‌ల న‌డుమ సాగుతున్న ట్వీట్ల‌ర్ల వార్‌ - మీడియా వార్ ఇప్పుడు ఏపీలో రాజ‌కీయం రంజుగా మారిందా..?  అధికార - ప్ర‌తిప‌క్ష పార్టీల స‌వాల్‌ - ప్ర‌తిస‌వాల్‌తో రాజ‌కీయ వేడి రాజుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయా..? ఇంత‌కు ప్రతిప‌క్ష నేత చంద్ర‌బాబుకు అధికార పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయిరెడ్డి విసిరిన స‌వాల్ ఏపీలో రాజ‌కీయ వేడిని రగిల్చింది. విజ‌య‌సాయి రెడ్డి విసిరిన స‌వాల్‌ ను ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు స్వీక‌రిస్తారా..?  లేక తేలు కుట్టిన దొంగ‌లెక్క ఉండిపోతారా..? అనేది తెలుగు రాష్ట్రాల్లో జోరుగా చ‌ర్చ‌లు సాగుతున్నాయి.

ఇన్ని రోజులు రాజ‌కీయంగా విసురుకున్న రాజ‌కీయ స‌వాళ్ల‌కు ఇప్పుడు విజ‌య‌సాయిరెడ్డి విసిరిన స‌వాల్‌ తో చంద్ర‌బాబు దిమ్మ తిరిగి బొమ్మ క‌నిపించ‌నున్న‌దా..? మ‌రి ఈ స‌వాల్‌ ను చంద్ర‌బాబు స్వీక‌రించి త‌న స‌త్తా చాటుకుంటాడా..? అనేది ఇప్పుడు పొలిటిక‌ల్ స‌ర్కిల్‌ లో జోరుగా చ‌ర్చ‌సాగుతుంది. ఇంత‌కు ప్ర‌తిప‌క్ష నేత  చంద్ర‌బాబు ఏమీ అన్నాడు. దానికి ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబుకు విసిరిన స‌వాల్ ఏమిటీ. ఓసారి లుక్కేద్దాం. ఏపీలో 4 నెలల్లోనే ముఖ్యమంత్రి జగన్ పాలనపై ప్ర‌జ‌ల‌కు విసుగొచ్చిందని - ప్రజలు ఇప్పుడు మళ్లీ తననే సీఎంగా కోరుకుంటున్నారంటూ చంద్రబాబు ఇటీవ‌ల వ్యాఖ్యానించారు. ఈ  వ్యాఖ్యలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా విమర్శలు గుప్పించారు.

ప్రజలు మళ్లీ తననే  కోరుకుంటున్నారట. ప్రజలంటే కుల మీడియా అధిపతులు - మీ బంధుగణం - మోచేతి నీళ్లు తాగే చెంచాలు కాదు చంద్రబాబు గారూ. 13 జిల్లాల్లోని ఐదు కోట్ల మందిని ప్రజలు అని అంటారు. ముందు మీరు కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసి గెలవండి. నిజంగానే ప్రజలు మిమ్మల్ని కలవరిస్తున్నారని భావిస్తారంతా అని ట్వీట్ చేశారు. చంద్ర‌బాబు నాయుడు ఇలాంటి స‌వాల్ వైసీపీ నుంచి గాని - ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి నుంచి వ‌స్తుంద‌ని ఊహించి ఉండ‌రు. విజ‌య‌సాయిరెడ్డి చంద్ర‌బాబును రాజీనామా చేసి స‌త్తా చాటుకో.. అది నీ కుప్పంలోనే అని స‌వాల్ విస‌ర‌డం ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

చంద్ర‌బాబు నిత్యం జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. ఆరోప‌ణ‌ల్లో భాగంగా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాలుగు నెల‌ల కాలంలోనే ఎలా విఫ‌లం అవుతుంది అనేది జ‌నం ప్ర‌శ్న‌. మ‌రి చంద్ర‌బాబు మాత్రం ముందుగానే విమర్శ‌లు చేస్తు వ‌స్తున్నారు. ఇప్పుడు చేసిన ఆరోప‌ణ‌ల‌కు విజ‌య‌సాయిరెడ్డి గ‌ట్టిగానే కౌంట‌ర్ ఇచ్చారు. దీనికి తోడు స‌వాల్ విసిరారు. ఈ స‌వాల్‌ను చంద్ర‌బాబు స్వీక‌రించి - తాను ప్రాతినిధ్యం వ‌హిస్తున్న కుప్పం అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేసే దమ్ముందా అని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతుంది. అంటే చంద్ర‌బాబు కనుక రాజీనామా చేసి తిరిగి పోటీ చేసి గెలిస్తే.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంపై రెప‌రెండంగానే భావించ‌వచ్చు.. చంద్ర‌బాబు చేసిన ఆరోప‌ణలు నిజ‌మే అని తేలిపోతుంది. మ‌రి చంద్ర‌బాబు విజ‌య‌సాయిరెడ్డి స‌వాల్‌ను స్వీక‌రిస్తాడో లేదో చూద్దాం.


Tags:    

Similar News