వాళ్లకు ఎమ్మెల్యే వీళ్లకు ఎమ్మెల్యే లేడు పీకే సీఎం అంట ఏంది అబ్బి ఈ జోక్?

Update: 2021-03-31 09:48 GMT
సీమలో ఎత్తితనుడు చూసినం.. ఫ్యాక్షనిజం సూసినం.. రక్తపాతం సూసినం.. కానీ ఈ కొత్త రాజకీయం ఏందబ్బీ.. ఇదీ.. బొత్తిగా రాజకీయం కనబళ్ల.. ఒక్క సీటు గెలవని తంబిని సీఎం సేసుడేందీ.. ఉట్టి కెక్కలేనమ్మ స్వర్గానికెక్కుతా అన్నెంట.. అసలే బీజేపీ ఏపీలో సచ్చి ఏడుస్తావుంటే.. ఈ మిండగాడు రాళ్లేసెనంట'' అంటూ ఏపీలోని సీమ జిల్లాల్లో ఇప్పుడు బీజేపీ-జనసేన బంధంపై బోలెడు కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఏపీ రాజకీయ తెరపై 'పవన్ సీఎం' మాట ప్రకంపనలు సృష్టిస్తోంది. ప్రత్యర్థులకు ఆయుధమై నిలుస్తోంది. ఇప్పటికే పవన్ సీఎం అనగానే టీడీపీలో వణుకు పుట్టింది. వైసీపీ మాత్రం ఇది తిరుపతిలో గెలుపు కోసం బీజేపీ వేసిన ఎత్తుగడగా అభివర్ణిస్తోంది.

ఏపీలో  కేంద్రం తీసుకున్న వ్యతిరేక  నిర్ణయాలతో ఆ పార్టీకి పుట్టగతులు లేకుండా పోయాయంటున్నారు. అందుకే ఇప్పుడు ఉనికి కోసం 'పవన్ నామ స్మరణ' చేస్తున్నారంట..  *పవన్ సీఎం@ అని ఏపీ ప్రజల చెవుల్లో మరోసారి పూలు పెట్టేందుకు వస్తున్నారని.. వీరి వల్ల ఏం కాదని వైసీపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు.

తాజాగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి 'బీజేపీ-జనసేన' బంధంపై హాట్ కామెంట్స్ చేశారు.  'జరుగుతున్నది తిరుపతి లోక్ సభ స్థానం ఉప ఎన్నిక. కాబోయే సీఎం  ఫలానా అంటూ బిస్కట్ వేయడం కాక మరేమిటి? ఆఫర్ చేసే పార్టీకి రాష్ట్రంలో  ఒక్క సీటు లేదు. దానిని తీసుకునే పార్టీకి ఉనికి లేదు. జోగి జోగి రాసుకుంటే బూడిద రాలిందట. కనీసం ఎమ్మెల్యే కూడా కాని వాడు ఏకంగా  సీఎం కుర్చీ ఎక్కుతాడట!' పవన్ సీఎం వ్యాఖ్యలను ఎద్దేవా చేశారు.ఇలా పవన్ సీఎం అన్న మాటపై రాయలసీమ జిల్లాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై చాలా మంది సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు.

వీడియో కోసం క్లిక్ చేయండి
Tags:    

Similar News