టీడీపీ రూట్లోకా.. ట్రాప్ లోకా : శ్రీలంకతో ఏపీని పోల్చుతున్న వైసీపీ ఎంపీ...?
ఇప్పటిదాకా శ్రీలంకతో ఏపీని విపక్షాలే పోల్చుతూ వచ్చాయి. అక్కడ అలా జరిగింది. ఇక్కడ అలా జరగవచ్చు అంటూ టీడీపీ జనసేన సహా వామపక్షాలు కూడా ఇదే దాని మీద మాట్లాడుతూ వచ్చాయి. ఒక దశలో అయితే శ్రీలంకలో ప్రజలు తిరుగుబాటు చేశారు. ఏపీలో జనాలకు ఓపిక ఎక్కువ అంటూ చంద్రబాబు లాంటి సీనియర్ కూడా తన అభిప్రాయమేంటో చెప్పారు. మొత్తానికి శ్రీలంక అన్నది ఏపీ రాజకీయాలో బాగా నానుతున్న విషయంగా ఉంది.
ఇవన్నీ పక్కన పెడితే అసలు శ్రీలంక సంక్షోభంతో ఏపీని ఎందుకు పోలుస్తారు అని వైసీపీ నేతలు కూడా గట్టిగా తగులుకుంటున్నారు. సజ్జల రామక్రిష్ణారెడ్డి అయితే శ్రీలంక ఒక దేశం, ఏపీ ఒక రాష్ట్రం, లింక్ ఎలా కుదురుతుంది చెప్పండి అని లాజిక్ పాయింట్ కూడా తీశారు. ఇపుడు మరికాస్తా ముందుకెళ్ళి ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి టోటల్ శ్రీలంక అర్ధిక పరిస్థితులు. అక్కడ ఎందుకు సంక్షోభం తలెత్తింది అన్న దాని మీద సోదాహరణమైన వివరణ ఇచ్చారు
ఆయన చెప్పేది ఏంటి అంటే శ్రీలంకలో 2019-20 సంవత్సరానికి వ్యాపార ఎగుమతులు 12.9 బిలియన్ డాలర్లుగా ఉంటే ఏపీలో 85,665 కోట్లు వ్యాపార ఎఉగుమతులు అయ్యాయని చెప్పుకొచ్చారు. ఇక 2021లో శ్రీలంకలో ఎగుమతులు 12 బిలియన్ డాలర్ల వద్దనే ఆగిపోతే ఏపీలో ఏకంగా 62 శాతానికి ఎగుమతులు పెరిగి 2 లక్షల కోట్లకు చేరిందని వివరించారు.
అందువల్ల ఏపీ నంబర్ వన్ పొజిషన్ లో ఉందని, ఎగుమతులలో టాప్ ర్యాంకులో ఉందని విజయసాయిరెడ్డి అంటున్నారు. ఈ విషయనంలో ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేనేలేదని కూడా ఆయన చెబుతుననరు. ఇక దేశీయంగా చూసినా భారత్ లోకి వచ్చిన విదేశీ చెల్లింపులు 83 బిలియన్ డాలర్లు అయితే శ్రీలంకకు వచ్చింది. 7.1 బిలియన్ డాలర్లు మాత్రమే అని విజయసాయిరెడ్డి అన్నారు.
ఇక గత ఏడాది అంటే 2021-22 నాటికి భారత్ కి వచ్చిన విదేశీ చెల్లింపులు 87 డాలర్లకు పెరిగాయని వివరించారు. అలాగే ఏపీకి వచ్చిన విదేశీ చెల్లింపులు 4.35 బిలియన్ డాలర్లుగా తెలిపారు. ఇక శ్రీలంకలో చూస్తే ఇదే ఏడాది విదేశీ చెల్లింపులు 5.49 బిలియన్లకు పడిపోయింది అని ఆయన పేర్కొన్నారు.
ఇలా ఏ విధంగా చూసినా విదేశీ చెల్లింపులను అందుకోవడంలో ఏపీ సుస్థిర పెరుగుదలను చూపించిందని, అందువల్ల శ్రీలంకతో ఏపీని ఎలా పోలుస్తారని ఆయన ప్రశ్నిస్తున్నారు. ఇంకో వైపు చూస్తే దేశంలో ఉన్న అప్పుల కన్నా ఏపీ అప్పులు తక్కువే అని కూడా ఆయన చెప్పారు.
అలాగే చూస్తే 2021-22 ఏడాదికి కేంద్రం అప్పులు జీడీపీ నిష్పత్తి 57 శాతంగా ఉంది. ఏపీలో జీడీపీ 32.4 శాతమే ఉందని అంటున్నారు. ఇక పంజాబ్ లో 47 శాతం, రాజస్థాన్ లో రాజస్థాన్ 39.8%, పశ్చిమ బెంగాల్ 38.8%, కేరళ 38.3%తో ఆంధ్రప్రదేశ్ కంటే ముందున్నాయని విజయసాయిరెడ్డి అంటున్నారు.
మొత్తానికి ఈ అంకెలు లెక్కలు ఇవన్నీ పక్కన పెడితే విజయసాయిరెడ్డి చెప్పింది ఏంటి అంటే కేంద్రం కంటే ఏపీ ఆర్ధికంగా ఆరోగ్యంగా ఉందని, అలాగే శ్రీలంక ఊసు కానీ దానితో పోలిక కానీ అసలు తీసుకురావద్దని గట్టిగా చెబుతున్నారు. అయితే పదే పదే శ్రీలంకను ప్రస్తావిస్తూ ఏపీలో విపక్షాలు జనం మెదళ్లలోకి ఆ భయంకర సంక్షోభాన్ని ఎక్కించడంతో ఫుల్ సక్సెస్ అయ్యాయి. అంతా అయ్యాక ఇపుడు నింపాదిగా విజయసాయిరెడ్డి ఏపీ సో బెటర్ అంటూ చెప్పిన వివరాలు గణాంకాలు జనాల బుర్రలకు ఎక్కుతాయా అన్నదే డౌట్. అదే శమయంలో టీడీపీ కామెంట్స్ ని తిప్పికొట్టబోయి ఆ ట్రాప్ లో వైసీపీ పడుతోందా అన్న చర్చ కూడా వస్తోంది.