తెలంగాణ కాంగ్రెస్ కొంప ముంచిన బాబు?

Update: 2018-12-11 05:00 GMT
ఈవీఎంలు ఓపెన్ అయ్యాయి. ఫ‌లితాలు ఒక్కొక్క‌టిగా బ‌య‌ట‌కు వ‌స్తోంది. మొత్తంగా గాలి ఎటు వీస్తుంద‌న్న విష‌యం మీద క్లారిటీ వ‌చ్చేసింది. ఇప్ప‌టివ‌ర‌కూ ఉన్న శంక‌లు తీరిపోయి.. తెలంగాణ‌లో విజ‌యం కారుదేన‌ని తేలిపోయింది. తెలంగాణ రాజు కేసీఆరేన‌న్న‌ది క‌చ్ఛిత‌మైంది. పోటాపోటీగా జ‌రిగిన ఎన్నిక‌ల్లో టీఆర్ ఎస్‌ కు గ‌ట్టి పోటీ ఇచ్చిన కూట‌మి చిత్తుగా ఓడిపోతున్న వైనం తాజాగా వెల్ల‌డ‌వుతున్న ఫ‌లితాల్ని చూస్తే అర్థ‌మ‌య్యే ప‌రిస్థితి.

ఇలాంటివేళ‌.. సోష‌ల్ మీడియాలో ప‌దునైన ట్వీట్ చేశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీల‌క నేత‌.. రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి. తాజాగా ఆయ‌న చేసి ట్వీట్ ఆస‌క్తిక‌రంగానే కాదు సంచ‌ల‌నంగా మారింది. తెలంగాణ‌లో కూట‌మి ఓట‌మికి చంద్ర‌బాబు అన్న విష‌యాన్ని ఆయ‌న సూటిగా చెప్పేశారు. మీడియా.. డ‌బ్బుతో ఏదైనా చేయొచ్చ‌న్న భ్ర‌మ‌లో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ఉంటార‌న్న ఆయ‌న‌.. మీడియా.. న‌మ్ముకున్న నోట్ల క‌ట్ట‌లు గెలిపించ‌లేవంటూ విమ‌ర్శించారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బాబు వ్య‌వ‌హార‌శైలిని తాజా మాజీ మంత్రి కేటీఆర్ చ‌క్క‌గా విశ్లేషించార‌న్న విజ‌య‌సాయి రెడ్డి.. తాచెడ్డ కోతి వ‌న‌మెల్ల చెడ‌గొట్టిన‌ట్లు తెలంగాణ కాంగ్రెస్‌ను నిండా ముంచుతున్నాడు పెద్ద నాయుడు అంటూ  ట్వీట్‌ తో తీవ్ర‌స్థాయిలో ధ్వ‌జ‌మెత్తారు. 

ఎన్నిక‌ల్లో త‌మ విజ‌యం గురించి కేటీఆర్ చేసిన విశ్లేష‌ణ‌ను విజ‌య‌సాయి గుర్తు చేసుకున్నారు. టీఆర్ ఎస్ వంద సీట్లు గెలుచుకుంటుంద‌ని.. కాంగ్రెస్ హేమాహేమీలు ఓడిపోనున్న‌ట్లు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో సీఎం అభ్య‌ర్థులుగా చెప్పుకునే వారు.. త‌మ త‌మ సొంత నియోజ‌క‌వ‌ర్గాల్ని సైతం దాట‌లేద‌న్న ఎద్దేవా చేసిన కేటీఆర్‌.. తాము ఫ‌లితాల కోసం వెయిట్ చేస్తున్నామ‌ని.. 11న టీఆర్ ఎస్ విజ‌యోత్స‌వాలు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు. ఆయ‌న చెప్పిన‌ట్లే జ‌రుగుతుండ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News