కొత్త వివాదం: బూటుకాళ్లతో రామతీర్థానికి చంద్రబాబు..!!

Update: 2021-01-03 08:00 GMT
టీడీపీ అధినేత చంద్రబాబు రాద్ధాంతం చేయబోయి పెద్ద తప్పు చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తాజాగా విజయనగరం జిల్లా రామతీర్థం పుణ్యక్షేత్రంలో ధ్వంసమైన విగ్రహాలను పరిశీలించి అక్కడ సభ ఏర్పాటు చేసి వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

అయితే పవిత్రక్షేత్రానికి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు కొత్త వివాదంలో చిక్కుకున్నారు. రామతీర్థాన్ని బూటుకాళ్లతో సందర్శించడం వివాదాస్పదమైంది. దీనిపై వివాదాలు చెలరేగుతున్నాయి. ఈ ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అధికార వైసీపీ నేతలు చంద్రబాబు అపచారం చేశారని భగ్గుమంటున్నారు.  

చంద్రబాబుకు దేవుడిపై భక్తి లేదని.. రాజకీయాల కోసం మతాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. తన హయాంలో పుష్కరాల పేరుతో గుడులను కూలదోయించిన చంద్రబాబు.. ఇప్పుడు అవే ఆలయాలను అడ్డుగా పెట్టుకొని మత విధ్వేషాలను రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు రాజకీయంగా ఎంతో మందిని వాడుకొని వదిలేశాడని.. ఇప్పుడు చెప్పుళ్లతో ఆలయానికి వెళ్లి దేవుళ్లతోనూ అలాంటి పనిచేస్తున్నారని మంత్రి బొత్స ఆరోపించారు.

ఇక బూటుకాళ్లతో రామతీర్థానికి వెళ్లి తీవ్ర అపచారానికి చంద్రబాబు పాల్పడ్డారని  వైసీపీ సీనియర్ నేత - రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. తాను బూట్లు విడిచి రామతీర్థం కొండను ఎక్కానని.. హిందువులు - ఏ మతానికి చెందిన వారైనా బూట్లు చెప్పులు విడుస్తారని.. కానీ చంద్రబాబుకు అలాంటి అలవాట్లు లేవని.. ఆయనకు అసలు భక్తియే లేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు. కేవలం రాజకీయం కోసమే ఇలా చేస్తున్నాడని విమర్శించాడు.

    

Tags:    

Similar News