ఎన్నికలకు కాస్త ముందు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు బాబు సర్కారు తీసుకున్న ప్రతి నిర్ణయం మీద ప్రత్యేక ఫోకస్ పెట్టిన ఆయన.. తాజాగా రాష్ట్ర గవర్నర్ నరసింహన్ కు ఒక లేఖ రాశారు.
ఎన్నికలకు కాస్త ముందుగా.. ప్రమోషన్లు.. పోస్టింగులపై బాబు తీసుకున్న నిర్ణయంపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం గవర్నర్ కు రాసిన లేఖలో ఏమేం అంశాలు ఉన్నాయన్న విషయంపై కొంత సమాచారం బయటకు వచ్చింది.
ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా విజయసాయి రెడ్డి ఆరోపించినట్లుగా తెలుస్తోంది. పోస్టింగులలోనే కాదు.. ప్రమోషన్ల విషయంలోనూ ఇదే విధానాన్ని బాబు సర్కారు అమలు చేసినట్లుగా ఆయన తప్పు పట్టినట్లుగా తెలుస్తోంది. ఈ అంశంపై గవర్నర్ దృష్టిసారించి.. తగు చర్యలు తీసుకోవాలని కోరినట్లుగా సమాచారం.
సామాజిక వర్గమే ప్రాతిపదికగా చేసుకొని 37 మంది డీఎస్పీలను అడ్డదారిలో ప్రమోషన్లు ఇచ్చారని.. పోస్టింగులు ఇచ్చినట్లుగా విజయసాయి రెడ్డి ఆరోపిస్తున్నారు. చంద్రబాబు చేష్టలు ప్రాథమిక హక్కులకు.. రాజ్యాంగ మౌలిక సూత్రాలకు భంగం కలిగిస్తున్నాయని.. సమతౌల్యాన్ని దెబ్బ తీస్తూ ఒక కులంపై వ్యతిరేకతను పెంచేలా ఉన్ననట్లుగా పేర్కొన్నట్లు తెలిసింది.
బయటకు వచ్చిన విజయసాయి ఆరోపణల్లో కొన్నింటిని చూస్తే..
- జీవో నెంబరు 54 ప్రకారం 2014లో ఇచ్చిన డీఎస్పీ ప్రమోషన్లు తప్పుల తడకలని అప్పటి డీజీపీ హైకోర్టులో ఒప్పుకున్నా, చంద్రబాబు సర్కారు 2019 ఎన్నికలకు ముందు అందులో కొందరికి ప్రత్యేకంగా పోస్టింగ్ లు ఇవ్వడం ద్వారా వల్లమాలిన ప్రేమ చూపింది.
- చిత్తూరుకు చెందిన డీఎస్పీ కేశప్పను (చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి) అడ్డం పెట్టుకుని చంద్రబాబు తన సొంత సామాజిక వర్గానికి పదోన్నతులు కల్పించారు.
- అనంతపురం స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ రామ్ కుమార్ - చంద్రబాబు అధికార నివాసం దగ్గర విధులు నిర్వహించే అమరనాథ నాయుడులవి పోలీసు ప్రమోషన్లు కావు. అవి కచ్చితంగా అడ్డదారి పొలిటికల్ ప్రమోషన్లే.
- రాష్ట్రంలోని ఐదు రేంజ్‌ల్లో ఉన్న డీఎస్పీ కింది ర్యాంకు పోలీసు ప్రమోషన్లలో సీఎం కార్యాలయం(సీఎంవో) జోక్యంతో అడ్డదార్లే రాజ మార్గాలయ్యాయి.
- పదోన్నతుల్లో పాటించాల్సిన రొటేషన్ రూల్సును కూడా ఆ 37 మంది విషయంలో అడ్డగోలుగా ఉల్లంఘించారు.
- ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా పని చేసేందుకు అప్పటి ఇంటెలిజెన్స్ డీజీ వెంకటేశ్వరరావు ఈ కుల ప్రమోషన్లు - పోస్టింగ్ ల పథకానికి రూపకల్పన చేశారు.
- నిబంధనలు పాటించకుండా ఘట్టమనేని శ్రీనివాస్ కు హడావిడిగా ప్రమోషన్ ఇచ్చి - గుంటూరు రేంజ్ ఎన్నికల ఇంటెలిజెన్స్ బాధ్యతలు అప్పగించడం ఇందుకు ఒక ఉదాహరణ.
- విచారణలో తప్పులు రుజువైతే వెంటనే ఈ పదోన్నతులు - పోస్టింగ్ లను రద్దు చేయాలి. అక్రమంగా పదోన్నతులు - పోస్టింగ్‌లు పొందిన వారిని డిమోట్ చేయాలి.