ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా అన్ని పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. ముఖ్యంగా టీడీపీకి వచ్చే ఎన్నికల్లో గెలవడం జీవనర్మణ సమస్యగా మారింది.
ఈ నేపథ్యంలో టీyీ పీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. జనవరి 27 నుంచి చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం వరకు లోకేష్ పాదయాత్ర సాగుతుంది. మొత్తం 4 వేల కిలోమీటర్ల పాదయాత్ర సాగుతుందని చెబుతున్నారు.
కాగా నారా లోకేష్ పాదయాత్ర ఇంకా ప్రారంభం కాకముందే వైసీపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. లోకేష్ ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్‌ను ఏమీ చేయలేరని వైసీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా వైసీపీ ముఖ్య నేత విజయసాయిరెడ్డి సైతం ఇదే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. లోకేష్ ఎక్కడ పర్యటిస్తే అక్కడ తమ ఓటు బ్యాంక్ శాతం పెరుగుతుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లోనే కాకుండా, లోక్‌సభ ఎన్నికల్లోనూ తమ పార్టీ ఘన విజయం సాధిస్తుందని విజయసాయిరెడ్డి తాజాగా తెలిపారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
పాదయాత్రతో నారా లోకేష్ సామర్థ్యం ఏంటో ప్రజల ముందు బట్టబయలవుతుందని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. లోకేష్ ఎక్కడ పర్యటించినా వైసీపీకి ఓట్ల శాతం పెరుగుతుందన్నారు. 2024లో వైసీపీ అఖండ విజయానికి లోకేష్ పాదయాత్రే కారణమవుతుందని తెలిపారు. తమ ప్రభుత్వంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు సంతోషంగా ఉన్నారనేది విజయసాయిరెడ్డి ఉద్దేశంగా కనిపిస్తోంది.
కాగా విజయసాయిరెడ్డి ట్వీట్‌పై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. సాధారణ జనం చచ్చిపోయినా వారంతా తన తండ్రి చావుని తట్టుకోలేక మరణించారంటూ జగన్ ఓదార్పు యాత్రలు, శవ యాత్రలు చేశారని టీడీపీ శ్రేణులు విజయసాయిరెడ్డికి ఘాటుగా కౌంటర్లు ఇస్తున్నారు.
లోకేష్ పాదయాత్రతో వైసీపీ ప్రభుత్వం మట్టికరవడం ఖాయమని టీడీపీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇంకా లోకేష్ పాదయాత్ర ప్రారంభం కాకముందే వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని.. ఇది వారిలో భయానికి నిదర్శనమని ఎద్దేవా చేస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో దాదాపుగా అన్ని నియోజకవర్గాల మీదుగా సాగేలా టీడీపీ అగ్ర నాయకత్వం లోకేష్ పాదయాత్రకు రూట్ మ్యాప్‌ను సిద్ధం చేస్తోంది.