ఇవాళ ముఖ్య‌మంత్రి.. రేప‌ట్నించి రాజ‌కీయ నిరుద్యోగి!

Update: 2019-05-22 11:54 GMT
సందేహాలు రాకూడ‌ద‌ని ఎవ‌రూ చెప్ప‌రు. కానీ.. దానికి ఒక అర్థం ప‌ర్థం ఉండాలి. ఎన్నిక‌ల ప్ర‌క్రియ ఇవాల్టికి ఇవాళ మొద‌లుకాలేదు. ఇప్ప‌టికి దాదాపు రెండు నెల‌ల‌కు పైనే దాటింది. ఇలాంట‌ప్పుడు ఈసీ రూల్ బుక్ లో ఉన్న అంశాల్ని ఒక్కొక్క‌టిగా తెర మీద‌కు తీసుకొస్తూ కొత్త సందేహాల్ని.. గంద‌ర‌గోళాన్ని సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్న తీరుపై ప‌లువురు ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. బాబు తీరుపై తాజాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత విజ‌య‌సాయి రెడ్డి ట్వీట్ తో వ‌రుస పంచ్ లు ఇచ్చారు.

ఏపీలో ఎన్నిక‌ల కౌంటింగ్ నిలిపివేయ‌టానికి బాబు చేయ‌ని కుతంత్రం లేద‌న్న ఆయ‌న.. వీవీ ప్యాట్ల లెక్కింపు పేరుతో రెండుసార్లు సుప్రీంలో పిటిష‌న్ వేసి ఓడిపోయిన వైనాన్ని పేర్కొన్నారు. త‌న అనుకూల వ్య‌క్తుల‌తో ఏపీ హైకోర్టు.. సుప్రీంకోర్టులో మ‌రోసారి అత్య‌వ‌స‌ర పిటిష‌న్లు దాఖ‌లు చేయించి తిర‌స్క‌ర‌ణ‌కు గురైన‌ట్లు పేర్కొన్నారు.

23వ తేదీతో రాజ‌కీయ నిరుద్యోగిగా మారే చంద్ర‌బాబు కొత్త ప‌ని కోసం ఎక్క‌ని గ‌డ‌ప‌.. దిగ‌ని గ‌డ‌ప లేద‌న్న‌ట్లుగా తిరుగుతున్నార‌ని.. ఆయ‌న‌కు ఊపాధి క‌ల్పించే స్థితిలో ఎవ‌రూ లేద‌ర‌న్నారు. వాళ్ల‌కే అస‌లు ఉద్యోగం లేక‌నో.. స‌గం ప‌నితోనో కాలం గ‌డుపుతున్నార‌ని.. అలాంటి వారి మ‌ధ్య బాబు ప‌ని కోసం ప్ర‌య‌త్నిస్తున్నారంటూ చుర‌క‌లు అంటించారు.

ఒక ప్ర‌యోజ‌న‌క‌ర కార్య‌క్ర‌మం కోసం ప్ర‌యాణాలు చేస్తే అంద‌రూ ప్ర‌శంసిస్తారు. బాబు తిరుగుళ్లు మాత్రం ఊసుకోక చేస్తున్న దేశ దిమ్మ‌రి యాత్ర‌ల్లా ఉన్నాయ‌ని.. ఓట‌మి త‌ప్ప‌ద‌ని తెలిసి త‌న‌ను తాను ఊర‌డించుకునేందుకు ప్రాంతీయ నేత‌ల చుట్టూ ప్ర‌దిక్షిణాలు చేస్తున్నాడ‌న్నారు.

సోనియాతో పాటు.. ఉత్త‌రాది నేత‌ల‌కూ సీన్ అర్థ‌మైంద‌ని.. ఎన్డీయే మ‌ళ్లీ అధికారంలోకి వ‌స్తుంద‌ని మాయా.. స్టాలిన్ అటు దూకేందుకుసిద్ధ‌మ‌వుతున్నారన్న విజ‌య‌సాయి రెడ్డి .. ఫెవికాల్ బాబాకు మాత్రం ఇవేమీ ప‌ట్ట‌న‌ట్లు ప్ర‌భుత్వం ఏర్పాటు చేస్తామ‌ని రాష్ట్రప‌తికి లేఖ ఇద్దామ‌న్న బాబు మాన‌సిక స్థితిని వారు అనుమానిస్తున్నార‌న్నారు. బాబు తీరును టైమ్లీగా ట్వీట్ల పంచ్ ఇస్తున్న విజ‌య‌సాయి తీరు తెలుగు త‌మ్ముళ్ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News