టీడీపీ అధినేత - మాజీ సీఎం చంద్రబాబుది సొల్లు వాగుడట.. అడిన అబద్దాలనే మళ్ళీ మళ్ళీ ఆడుతూ.. ఒకటే సొల్లు వాగుడు వాగుతున్నాడని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్టిట్టర్ లో ట్వీటారు.. నిత్యం సోషల్ మీడియాలో ఉంటూ టీడీపీపైనా - చంద్రబాబు పైనా తనదైన శైలీలో తిట్ల వర్షం కురిపించే ఎంపీ విజయసాయిరెడ్డి కొద్ది సేపటి క్రితం ట్విట్ చేశారు. విజయసాయిరెడ్డి చంద్రబాబుపై చేసిన ట్విట్ ఇలా ఉంది.
పోలవరం అంచనాలను రు. 16 వేల కోట్ల నుంచి 58 వేల కోట్లకు పెంచడంలో జరిగిన అవినీతిపై ఢిల్లీ హైకోర్టు కేంద్ర జలవనరుల శాఖను విచారణకు ఆదేశించిన తర్వాత చంద్రబాబు స్వరం మారింది... నిరాశా నిస్పృహలు ఆవహించాయి... ఏం మాట్లాడుతున్నాడో తెలియడం లేదు... అవే అబద్ధాలు. అదే సొల్లు. అంటూ ట్విట్టర్ లో పోస్టు చేశారు విజయసాయిరెడ్డి. అంతకు ముందు కూడా విజయసాయి రెడ్డి మరో ట్విట్ చేశారు. చంద్రబాబుకు సొంత డబ్బా కొట్టకోవడంలో దిట్ట అని పోస్టు పెట్టారు. దేశంలో ఓడిపోయినా... పదవిలో ఉన్న ఏ సీఎం ఇంతగా సొంత డబ్బా కొట్టుకోలేదని పోస్టు చేశారు.
40 ఇయర్స్ ఇండస్ట్రీ - 14 ఏళ్లు సీఎం - 10 ఏళ్ళు అపోజిషన్ లీడర్ - మళ్లీ మూడోసారి అదే పోస్టు. నోస్టాల్జియాలో జీవిస్తున్నాడు. పాపం తనకు తాను ధైర్యం చెప్పుకోవడానికి పదేపదే ఈ విషయాలు జ్ణాపకం చేస్తుంటారు. దేశంలో ఓడిన, పదవిలో ఉన్న సీఎం లెవరూ ఇలా సొంత డబ్బా కొట్టుకోలేదు. అంటూ బాబుపై విజయసాయి విరుచుకుపడ్డారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి పెట్టిన పోస్టు సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోంది. టీడీపీ - చంద్రబాబుకు సోషల్ మీడియా పోస్టులతో విజయ సాయిరెడ్డి గుక్కతిప్పుకోకుండా ప్రశ్నలు సంధిస్తూనే, మరోవైపు విమర్శలు కూడా గుండెల్లో గుణపాలు గుచ్చెలా - ఈటెల్లాంటి మాటలతో ఉక్కిరి బిక్కిరి చేస్తున్నారు.