తెలుగుదేశం అధినేత - ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు మీద ట్వీట్ వార్ కంటిన్యూ చేస్తున్నారు వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి. ఇటీవల చంద్రబాబు నాయుడు మాజీ పీఎస్ పి.శ్రీనివాస్ ఇళ్లపై ఐటీ రైడ్స్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ అంశం గురించి సాయిరెడ్డి ట్వీట్ల పరంపర కొనసాగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్లు ఆ ఐటీ రైడ్స్ ను చిన్నవిగా చూపుతున్నారు. శ్రీనివాస్ ఇంటిపై ఐటీ రైడ్స్ లో ఏం దొరకలేదు అన్నట్టుగా వారు మాట్లాడుతున్నారు. అయితే సాయిరెడ్డి మాత్రం ఈ విషయం మీదే స్పందిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో ఆయన ట్వీట్ చేశారు.
'ఇంత బతుకు బతికి ఇంటెనక... అన్నట్లుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. తన దోపిడీ వ్యవహారాల గుట్టంతా మాజీ పిఎస్ శ్రీనివాస్ వద్ద ఉన్నట్టు ఐటి దాడుల తర్వాత క్లియర్ గా అర్థమైంది. మ్యానిపులేషన్లతో వ్యవస్థలను చెరబట్టిన వ్యక్తి చివరకు శ్రీనివాస్ అనే ఉద్యోగి దగ్గర తన ‘పాస్ వర్డ్’ వదిలేశాడు.'
అంటూ ఒక ట్వీట్లో పేర్కొన్నారు ఆయన. అలాగే శ్రీనివాస్ చాలా కమిట్ మెంట్ తో ఉన్నారని మరో ట్వీట్ చేశారు అంతకు ముందే. చంద్రబాబు నాయుడి డీటెయిల్స్ ను ఆయన ఇవ్వడం లేదన్నట్టుగా ప్రస్తావించారు. ఇక చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్తారంటూ మరో ట్వీట్ చేశారాయన.
'ఎలక్షన్లలో గెలిపిస్తే ఏం చేస్తారో చెప్పుకుంటారు ఎవరైనా. బాబు మాత్రం తన పరిస్థితిని ముందే అంచనా వేశాడు. ‘ఎన్నికల్లో ఓడితే జైలుకు పోతా. జైలుకు వెళ్లకుండా ఉండాలంటే నన్ను గెలిపించాలి. అరెస్టు చేయడానికి వస్తే మీరంతా వలయంలా నిల్చుని రక్షణ కల్పించాల’ని భవిష్యవాణిని వినిపించాడు.' ఇలా చంద్రబాబు మీద విజయసాయిరెడ్డి ట్వీట్ల వార్ కొనసాగుతూ ఉన్నట్టుంది.