వైఎస్సార్ కాంగ్రెస్ ప్రముఖ నేత విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అతి త్వరలో విశాఖపట్నం తరలిపోతుందని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి జగన్ అతి త్వరలో తన కేబినెట్ తో సహా విశాఖ నుంచి పరిపాలిస్తారని విజయసాయిరెడ్డి వెల్లడించారు.
చాలా కాలం క్రితమే జగన్ సర్కారు వైజాగ్ కు రాజధాని తరలించాలనుకుంది. అమరావతి ఉద్యమం, కోర్టుల్లో కేసుల వల్ల తరలింపు ఆపేసింది. కొంతకాలం క్రితం హైకోర్టు విచారణ ను మళ్లీ ముందు నుంచి ప్రారంభిస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీనివల్ల ఇక రాజధాని తరలింపు ఆగినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ కొత్త లాజిక్ తో రాజధానిని తరలించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. అది ఎలానో కూడా విజయసాయిరెడ్డి చెప్పేశారు.
ఇంతకీ ఆయన మాటల్లో చెప్పాలంటే... ‘‘త్వరలోనే విశాఖకు ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ వస్తుంది. ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగుతుంది. సీఆర్డీఏ కేసులకు రాజధాని తరలింపునకు సంబంధం లేదు. అతి త్వరలో విశాఖకు ఎగ్జిక్యూటివ్ రాజధాని వస్తుంది. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఎక్కడి నుంచైనా పరిపాలన సాగించవచ్చు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొంతకాలంగా హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించిన విషయాన్ని మనకు తెలుసు. విశాఖ నుంచి పరిపాలన ఎప్పుడు మొదలవుతుందనే అంశంపై తాను కచ్చితమైన తేదీ చెప్పలేను, కానీ అతి త్వరలోనే విశాఖ నుంచి పరిపాలన జరగనుంది‘‘ ఇవి విజయసాయిరెడ్డి స్వయంగా చేసిన వ్యాఖ్యలు.
అంటే ప్రభుత్వం ఎక్కడా రాజధాని తరలింపు అని ప్రకటించదు. కానీ ముఖ్యమంత్రి, ఆయన మంత్రివర్గం, సచివాలయం విశాఖకు తరలిపోతుంది. వాస్తవానికి ముఖ్యమంత్రి ఎక్కడైనా తన కార్యాలయం ఏర్పాటుచేసుకోవచ్చు. ఈ వెసులు బాటుతో రాజధాని తరలింపుపై ప్రభుత్వం తాజా ఆలోచన చేస్తున్నట్టు సాయిరెడ్డి మాటలను బట్టి అర్థమవుతుంది.