జగన్ వెనుక ఆ ముగ్గురే బలం.. బలగం..

Update: 2019-05-31 08:38 GMT
ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు.. నాన్నను సీఎం చేసినా పార్టీ తోడుగా లేదు.. నాన్న చనిపోయాక ఒంటరిని చేసినా వెరవలేదు. దేశాన్ని ఏలుతున్న సోనియాను ఎదురించే కొత్త పార్టీ పెట్టుకున్నాడు. ప్రతీకారంగా కేసులు పెట్టినా వెరవలేదు. చివరకు తొమ్మిదేళ్లు దేశంలోని వ్యక్తులు.. రాష్ట్రంలోని శక్తులను ఎదురించి ఏపీకి ముఖ్యమంత్రి అయ్యాడు.. అతడే వైఎస్ జగన్. జగన్ లోని మొండి పట్టుదల.. ధైర్యం ఎన్నో కష్టాలు ఎదురైనా ఎదురించి విజయతీరాలకు చేర్చింది.

2014లో తృటిలో తప్పిన ఓటమికి కృంగిపోకుండా వైఎస్ జగన్ పోరాడారు. 2019లో దేశమంతా బీజేపీ హవాసాగింది. పక్కనున్న తెలంగాణలోనూ బీజేపీ 4 ఎంపీ సీట్లను దక్కించుకుంది. కానీ జగన్ పోరాటం ముందు ఏపీలో బీజేపీ తలవించింది. అలా అరవీర భయంకరంగా జగన్ గెలవడానికి తెరవెనుక ఎవరున్నారన్నది ఆసక్తిగా మారింది.

జగన్ ఇంతలా దేశంలోని - రాష్ట్రంలోని వ్యక్తులు వ్యవస్థలతో పోరాడడానికి స్ఫూర్తినిచ్చింది.. సమరోత్సాహాన్ని రగిలించింది ముగ్గురే ముగ్గురు.. జగన్ తల్లి విజయమ్మ - జగన్ భార్య భారతి - జగన్ సోదరి షర్మిల.. ఈ ముగ్గురు లేకుంటే జగన్ ఇంత సాధించేవాడు కాదంటారు..

జగన్ కాంగ్రెస్ నుంచి వేరుపడి కొత్త పార్టీ పెట్టినప్పుడు అతడికి పూర్తి అండగా ఉండి స్థైర్యాన్ని ఇచ్చింది విజయమ్మే అంటారు. ఇక చాలు అని కొడుకు కష్టాలకు వెరిసి విజయమ్మ ఊరుకుంటే ఇప్పుడు జగన్ సీఎం అయ్యేవారు కాదు.. కొడుకును ముందుండి నడిపించడంలో జగన్ తల్లి  ఇచ్చిన మనోధైర్యమే కొండంత శక్తినిచ్చింది. ఇక జగన్ భార్య రాజకీయ కుటుంబం నుంచే వచ్చారు. ఇక జగన్ జైలుకెళ్లి 16 నెలల పాటు ఉండిపోయినా.. ఆయన స్థానంలో వ్యాపారాలు, సాక్షి మీడియాను భారతి భుజాలకెత్తుకొని తీసుకెళ్లింది. భర్త మూడేళ్లుగా ప్రజల్లోనే పాదయాత్రలో ఉన్నా అన్నీ తానై వ్యవహరించింది. ఇక జగన్ వదిలిన బాణంగా జగన్ జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి.. పార్టీని బతికించింది. పార్టీ కోసం జగన్ లేనప్పుడు ప్రచార బాధ్యతను, పార్టీని నడిపించింది షర్మిలే.. ఇలా చెల్లెలు కూడా జగన్ కోసం పనిచేసింది.

ఇలా వ్యతిరేక శక్తులందరూ ఏకమై జగన్ ను ముప్పుతిప్పలు పెట్టిన వేళ జగన్ వెంట ఉన్నది ఈ ముగ్గురు మహిళలే.. విజయమ్మ, భారతి, షర్మిలలు తోడుగా లేకుంటే జగన్ ఇంత సాధించి ఉండేవాడు కాదన్నది పార్టీ వర్గాలు చెబుతున్న మాట..


Tags:    

Similar News