తారకరత్న మరణాన్ని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోవడం లేదు. నటుడిగా కొనసాగుతూనే రాజకీయాల్లోకి ప్రవేశించి ఎమ్మెల్యేఅవుదామనుకున్న తారకరత్న కోరిక తీరకుండానే కాలం చేశారు. తారకరత్న మృతికి సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేసింది. తారకరత్న భార్య, పిల్లల బాధ్యత తనదేనని బాలయ్య మాటిచ్చారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. బాలయ్య నిర్ణయించిన సమాయానికి తారకరత్న అంత్యక్రియలు జరుగుతాయన్నారు.
తారకరత్న మరణం తనను ఎంతగానో బాధించిందని.. సినీ రంగంలో ప్రతి ఒక్కరితో సత్సంబంధాలు కొనసాగించారని విజయసాయిరెడ్డి అన్నారు. సోమవారం మధ్యాహ్నం 3.00 గంటలకు తారకరత్న అంతక్రియలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
తన భర్త మృతితో అలేఖ్యరెడ్డి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని.. అలేఖ్య తారకరత్న మరణాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఉదయం 9 గంటలకు ఫిలిం చాంబర్ కు భౌతిక ఖాయాన్ని అభిమానుల సందర్శనార్థం తీసుకువస్తారని.. మధ్యాహ్నం 3 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తామన్నారు.
-తారకరత్న దహన సంస్కారానికి ముహూర్తం ఫిక్స్ చేసిన బాలయ్య!
విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ తారకరత్న దహన సంస్కారాలకు ముహూర్తం ఫిక్స్ చేసింది నందమూరి బాలకృష్ణ అని తెలియజేసారు. తారకరత్నను కాపాడేందుకు బాలయ్య చేసిన కృషికి సాయిరెడ్డి బహిరంగంగా కృతజ్ఞతలు తెలిపారు. తారకరత్నకు అత్యుత్తమ వైద్యం అందించారని సాయిరెడ్డి అంగీకరించారు. నందమూరి బాలకృష్ణకు తారకరత్న కుటుంబం రుణపడి ఉంటుందని విజయసాయిరెడ్డి అన్నారు. అలేఖ్యారెడ్డికి, సాయిరెడ్డి భార్య సునంద చెల్లెలి సొంత కూతురు కావడంతో విజయ్ సాయిరెడ్డి ఆమెకు వరసకు పెద్దా నాన్న అవుతారు.
-అనారోగ్యం పాలైన తారకరత్న భార్య
నందమూరి తారకరత్న మృతి తర్వాత ఆయన సతీమణి అలేఖ్యారెడ్డి అస్వస్థతకు గురయ్యారు. గత రెండు రోజులుగా ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో ప్రస్తుతం ఆమె నీరసంగా ఉంది. తారకరత్న మృతితో షాక్‌కు గురైన అలేఖ్యారెడ్డి తన ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని ఓదారుస్తోంది. తారకరత్న అంత్యక్రియలు నేడు మహాప్రస్థానంలో జరగనున్నాయి.
2012లో అలేఖ్య, తారకరత్నలు నందమూరి కుటుంబ సభ్యుల కోరికకు వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నారు. వారు చాలా సంవత్సరాలు తారక్ తల్లిదండ్రులకు దూరంగా ఉన్నారు. నెమ్మదిగా తారక్ తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించారు. చిరంజీవి, బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్‌రామ్, చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌తో పాటు పలువురు నిన్న తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించారు. వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసే యోచనలో ఆయన ఉన్నారు. ఆయన ఆకస్మిక మృతితో తెలుగు చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతికి లోనైంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.