తెలంగాణ ఫైర్ బ్రాండ్ , కాంగ్రెస్ నేత విజయశాంతి ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారని తెలిసింది. ఆమె బీజేపీలో చేరడం దాదాఫు ఖరారైనట్టు తెలిసింది. ఏ రోజు చేరుతుందనేది తేది ఖరారు కావాల్సి ఉంది.
బీజేపీ పెద్దలు ఇప్పటికే ఆమెతో చర్చలు జరిపారు. మూడు సార్లు కలిసి మాట్లాడారు. కేంద్రహోంమంత్రి కిషన్ రెడ్డి ఒకసారి..అంతకుముందు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రెండు సార్లు సమావేశమయ్యారు. ఆమెను బీజేపీలో చేరేలా ఒప్పించారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో విజయశాంతి సమావేశమైనట్టు భోగట్టా..
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అయ్యాక ఆయన దూకుడు వైఖరి విజయశాంతికి బాగా నచ్చిందని.. కేసీఆర్ సర్కార్ ను బండి ఎదుర్కొంటున్న తీరుకు ఆనందంగా ఉందని.. అందుకే ఇలాంటి పార్టీలో ఉండాలని విజయశాంతి కోరుకుంటున్నట్టు తెలిసింది. మరోవైపు విజయశాంతి గొప్ప నాయకురాలని.. తెలంగాణ మిగతా ఉద్యమకారుల్లాగానే ఆమెకు కేసీఆర్ అన్యాయం చేశారని బండి సంజయ్ ఆరోపించడం విశేషంగా మారింది. ఈ క్రమంలోనే బీజేపీకి మద్దతుగా విజయశాంతి ఆదివారం ట్వీట్ చేయడం విశేషం.
దుబ్బాకలో గెలవగానే బీజేపీ భారీ ఎత్తున చేరికలపై దృష్టిసారించాలని.. పార్టీని బలోపేతం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. టీఆర్‌ఎస్ లోని కొందరు అసంతృప్త నేతలతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వలసలను ప్రోత్సహించాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలిసింది.
ప్రధానంగా కాంగ్రెస్ ను దెబ్బతీసి ఆ నాయకులను చేర్చుకొని.. టీఆర్ఎస్ అసమ్మతులను లాగేసి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ ప్లాన్ వర్కవుట్ అయితే 2024లో అధికారమే లక్ష్యంగా వెళ్లనున్నట్లు తెలిసింది.