బీజేపీతో రాజకీయాల్లోకి వచ్చి ఆ తరువాత తల్లి తెలంగాణ పార్టీ పెట్టి.. అనంతరం టీఆరెస్ నుంచి ఎంపీగా గెలిచి మొన్నటి సార్వత్రిక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ లో చేరిన తెలుగు మాజీ హీరోయిన్ విజయశాంతి మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలం కావడానికి పథక రచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల తరువాత చప్పుడు చేయకుండా - ఎక్కడున్నారో కూడా తెలియకుండా రాజకీయాలకు దూరంగా ఉంటున్న ఆమె మళ్లీ తెలంగాణ పాలిటిక్సులోకి రీ ఎంట్రీ ఇవ్వడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తాజాగా ఆమె మీడియా ముందుకు రావడంతో ఊహాగానాలు మొదలయ్యాయి. కాంగ్రెస్ నుంచి టీఆరెస్ లోకి నేతల వలసల నేపథ్యంలో కాంగ్రెస్ - టీఆరెస్ లు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న ఆరోపణల్లో భాగంగా విజయశాంతి పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. తమ నేతలను టీఆరెస్ లో చేర్చుకోవడం తప్పని కాంగ్రెస్ నేతలు అంటుండడగా.. అప్పట్లో తమ పార్టీ నుంచి మీరు విజయశాంతిని చేర్చుకోలేదా అని టీఆరెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో విజయశాంతి మీడియా ముందుకొచ్చి అప్పటి పరిస్థితులను వివరించారు. తాను 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్ లో చేరడం నిజమే అయినా అప్పటికే 2013లో తనను టీఆరెస్ సస్పెండ్ చేసిందని చెప్పుకొచ్చారు.
ఇదంతా ఎలా ఉన్నా విజయశాంతి ఇప్పుడు హడావుడిగా ఊడిపడడం వెనుక పెద్ద ప్లానే ఉందంటున్నారు. టీఆరెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండడం.. విపక్షాల్లో నాయకులనేవారు కనిపించడకపోవడంతో రీఎంట్రీకి ఇది మంచి తరుణంగా ఆమె భావిస్తున్నట్లు చెబుతున్నారు. చాలాకాలంగా స్తబ్దుగా ఉన్న విజయశాంతి ఇప్పుడు తనకు సంబంధం లేని విషయంలో వచ్చి వివరణ ఇవ్వడం వెనుక ఆమె రాజకీయ పున:ప్రవేశ ప్రణాళిక ఉందంటున్నారు.
తాను గతంలో పనిచేసిన బీజేపీ కేంద్రంలో.. టీఆరెస్ తెలంగాణలో అధికారంలో ఉండగా తాను మాత్రం అధికారం కోల్పోయిన కాంగ్రెస్ లో ఉన్నానని విజయశాంతి మధనపడుతున్నట్లగా తెలుస్తోంది. దీంతో ఈసారైనా తన రాజకీయ భవిష్యత్తును పరీక్షించుకోవాలనుకుంటూ కాంగ్రెస్ లో ఉంటూనే ఎదగాలని నిర్ణయానికి వచ్చినట్లు చెబుతున్నారు. ఈ క్రమంలో ఆమె గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారని టాక్. ఈ మేరకు తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై ఒక సినిమా కూడా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సినిమా విడుదల అనంతరం రాజకీయాల్లో మళ్లీ క్రియాశీలం కావాలని అనుకుంటున్నారట. అయితే... నేతలంతా ఒక్కరొక్కరుగా పార్టీని వీడుతున్న తరుణంలో సినీ గ్లామర్ - ప్రజల్లో ఇప్పటికీ కొంత ఆదరణ ఉన్న విజయశాంతి వంటివారు మళ్లీ క్రియాశీలం అయితే అది కాంగ్రెస్ కు ప్లస్ పాయింటే కానుంది. విజయశాంతి రీఎంట్రీ నిజమే అయితే మాత్రం ఇదే మంచి సమయమని.. ఈసారి ఆమెకు కాలం కలిసి వచ్చే అవకాశాలున్నాయని రాజకీయవర్గాల్లో వినిపిస్తోంది.